ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ టాప్ సీక్రెట్.. అందుకేనా వారితో అంత గ్యాప్ వచ్చింది..!

ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ తన సినిమాల్లో నటించిన రాజీవ్ కనకాల లాంటి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ.. వారితో తన స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో తనకు పరిచయం ఉన్న ఎంతోమంది చిన్నా నటులతో కూడా 20 ఏళ్లుగా తన స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.

Hollywood Critics Association admits inviting RRR star Jr NTR for award  show, reveals reason for actor's absence - India Today

ఇక తనతో సినిమాలు చేసిన దర్శకులు నిర్మాతలు హీరోయిన్లతోను ఎన్టీఆర్ స్నేహం అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్‌కు మంచి మిత్రుడు. ఎన్టీఆర్ నానిని ఆప్యాయంగా నాని అన్న అని ప్రేమ‌గా పిలుస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ కెరీర్ మోద‌టిలో నాని దిక్సూచిలా ఉండేవారు. ఆ తర్వాత తన కెరీర్లో ఎంతో సాయం చేసిన నాని బ్యానర్ లో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో నటించాడు. సాంబ- అదుర్స్ ఈ రెండు సినిమాలు కొడాలి నాని కోసం ఎన్టీఆర్ చేసినవే.

Rajeev Kanakala Makes Hilarious Fun On Jr NTR | TFPC - YouTube

కొడాలి నాని- ఎన్టీఆర్ స్నేహం చాలా ఏళ్లపాటు ఎంతో మంచిగా కొనసాగింది. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య సఖ్యత లేదన్న ప్రచారం కూడా ఉంది. దీనిపై గ‌తంలో కొడాలి నాని కూడా స్పందించాడు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌పై ప్రముఖ దర్శకుడు వివి. వినాయక్ గ‌తంలో చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మ‌రాయి. ఎన్టీఆర్ హీరోగా కొడాలి నాని నిర్మించిన సాంబ- అదుర్స్ సినిమాలకు వినాయక్‌ దర్శకుడుగా ఉన్నారు.

Tollywood star actor jr ntr and vv vinayak adurs movie sequel, what vv  vinayak says | Tollywood: జూనియర్ ఎన్టీఆర్‌తో వివి వినాయక్ అదుర్స్  సీక్వెల్, తదుపరి సినిమా | వినోదం News in Telugu

ఇక వీరిద్దరి గ్యాప్ గురించి వినాయక్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్- కొడాలి నాని ఎంతో మంచి స్నేహితులు.. అయితే రాజకీయపరమైన వైరుధ్యం నేపథ్యంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, నాని వైసీపీలో చేరడంతో ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. అప్పటివరకు వారిద్దరూ అన్ని సమయాల్లోనూ కలిసే ఉన్నారు. పార్టీలు కుటుంబాలు వారి మధ్య అనుకొని అంతరాన్ని పెంచేసాయి. అందుకే ఎన్టీఆర్ నానితో తెగదెంపులు చేసేసుకున్నాడ‌ని తాను అనుకుంటున్నట్టు వినాయక్‌ తెలిపాడు.

Jr NTR-kodali Nani: కొడాలి నానికి లైన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. మరి మాజీ  మంత్రి స్పందిస్తారా..?– News18 Telugu

ఇక ఎన్టీఆర్ ఎంతో కంఫర్ట్ మనిషి అని.. అతను ఎవరితో అయినా ఒకసారి స్నేహం చేశాడు అంటే వదిలిపెట్టడ‌ని ఎవరితో ఎలా ? మాట్లాడాలో ఎవరికి ఎక్కడ హద్దులు పెట్టాలో ఎన్టీఆర్ కు చాలా బాగా తెలుసు అని కూడా వినాయక్ చెప్పాడు. ఇక భవిష్యత్తులో ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా ? అన్న ప్రశ్నకు వినాయక్ బదులిస్తూ చెప్పలేం అని చెప్పాడు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి