ఆ సంవత్సరం మెగాస్టార్ వెండితెరపై ఎందుకు కనిపించలేదు..షాకింగ్ రీజ‌న్‌…!

సాధారణంగా మనిషి జీవితంలో గెలుపు, ఓటములు సహజంగా ఎదురవుతూ ఉంటాయి. ఈ గెలుపు ఓటములకు స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చూడని హిట్ సినిమా లేదు.. 1987లో మొదలుపెట్టి 1992 వరకు చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన స్టార్ హీరోగా నిలిచాడు. ఇలాంటి ఎన్నో ఘనతలు సాధించిన చిరంజీవికి కూడా ఓ సందర్భంలో భారీ అప‌జ‌యాల‌ను అందుకున్నాడు.

చిరంజీవి మెగా లుక్స్.. 90ల్లో అన్నయ్య స్టైల్ అదుర్స్.. | Megastar  Chiranjeevi rare and stylish photos in late 90s with superb mass looks pk–  News18 Telugu

మ‌రీ ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి భారీ విజయాలతో దూసుకు వెళ్తున్న చిరంజీవి కెరీర్‌కు 1995 వచ్చేసరికి ఆయన సినిమాలు విజయాలు సాదించ‌డం త‌గ్గాయి. ఆపద్బాంధవుడు, మెకానిక్ అల్లుడు, బిగ్ బాస్, ఎస్పీ పరశురామ్, రిక్షావోడు వంటి మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద బాగా నిరాశ పరిచాయి. చిరంజీవి కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన స్వయంకృషి మ‌త్రం ఓ మోస్త‌రు విజ‌యం అందుకుంది.

Chiranjeevi Birthday Special: Not Just An Actor, An Emotion That Will Be  The Same Forever - Zee5 News

ఈ సినిమా త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌తి సినిమా చిరుకు భారీ ఫ్లాప్ సినిమాలుగా మిగిలిపోయి. ఈ సినిమాల త‌ర్వాత 1995లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అల్లుడా మజాకా కూడా చిరంజీవికి విజయాన్ని అందించలేకపోయింది. ఈ తరుణంలోనే 1996లో చిరంజీవి పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉన్నాడు.

Pics | 11 lesser-known facts about megastar Chiranjeevi | Deccan Herald

వాస్తవంగా చెప్పాలంటే మెగాస్టార్ ఆ సంవత్సరం వెండి తెర‌పై కనిపించలేదు. ఆ ఏడాది మొత్తం ఎన్నో కథలు విని 1997లో ఎడిటర్ మోహన్ సమర్పణలో, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వ‌చ్చిన‌ హిట్లర్ సినిమాతో మ‌ళ్ళీ హిట్ అందుకున్నాడు. అక్క‌డ నుంచి చిరుకు మ‌ళ్లీ విజ‌యాల ట్రాక్ స్టార్ట్ అయ్యింది. అలా ఆ సంవ‌త్స‌రం చిరు సినిమాల‌కు దూరమయ్యాడు.

Share post:

Latest