మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టాలీవుడ్‌లో ఖచ్చితంగా గొప్ప డైరెక్టర్. రాజమౌళిని పక్కన పెట్టేస్తే త్రివిక్రమ్‌ను ఢీ కొట్టేంత గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరు ? అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఎలాంటి భారీ బడ్జెట్‌లు, గొప్ప స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టడం త్రివిక్రమ్ స్టైల్. త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎంతో మంది స్టార్ హీరోలు కూడా క్యూలో ఉంటున్నారు. అయితే అల వైకుంఠపురం లాంటి సూపర్ హిట్ తర్వాత ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ తన ఫ్యాన్స్‌ను మాత్రం బాగా డిజప్పాయింట్ చేశాడు.
ప్రస్తుతం మహేష్‌బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా అయినా త్వరగా వస్తుందన్న ఆశలతో ఉన్నారు. త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ – బన్నీ, త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ అంటే పిచ్చ క్రేజ్ ఉంటుంది. పవన్‌కు జల్సా, అత్తారింటికి దారేది లాంటి రెండు బ్లాక్‌బస్టర్లు, బన్నీకి ఏకంగా మూడు సూపర్ హిట్లు ఇస్తే.. మహేష్‌కు అతడు లాంటి హిట్‌తో పాటు ఖలేజా లాంటి గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడు.
ముఖ్యంగా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమాగా భారీ అంచనాలతో అజ్ఞాతవాసి వచ్చింది. 2018 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. భారీ అంచనాలు, పవన్ కెరీర్‌లోనే టాప్ ప్రి రిలీజ్ బిజినెస్, హయ్యస్ట్ బుకింగ్స్.. ఎక్కడ చూసినా ఈ సినిమా నామస్మరణే జరిగింది. అంత అంచనాలతో వచ్చి ఈ సినిమా బొక్క బోర్లాపడింది.
ఈ సినిమాకు ఫస్ట్ డే ఏకంగా రు. 55 కోట్ల వసూళ్లు అది ప్లాప్ టాక్‌తో వచ్చాయంటేనే ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఎలాంటి బజ్ ఉందో తెలుస్తోంది. ఈ సినిమా ప్లాప్ తర్వాత ఇండస్ట్రీ జనాల ముందు త్రివిక్రమ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. త్రివిక్రమ్ పనైపోయిందనే అందరూ అన్నారు. అసలు త్రివిక్రమ్‌ను స్టార్ హీరోలు ఎవ్వరూ దగ్గరకు రానివ్వరని కామెంట్లు చేశారు.
అలాంటి టైంలో ఎన్టీఆర్ పిలిచి మరీ త్రివిక్రమ్‌కు అరవింద సమేతతో ఛాన్స్ ఇచ్చాడు. నిజానికి ఆ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం, టేకింగ్ కన్నా ఎన్టీఆర్ యాక్టింగే ప్లస్ అయ్యింది. నిజానికి అది త్రివిక్రమ్ ఎన్టీఆర్‌కు ఇచ్చిన హిట్ కాదు.. ఎన్టీఆరే త్రివిక్రమ్‌కు ఇచ్చిన హిట్. తాను ఎన్నో అవమానాలకు గురైనప్పుడు ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చి మళ్లీ తనను తాను ఫ్రూవ్ అయ్యేలా చేసిన ఈ సాయం ఎప్పటకీ మర్చిపోలేనిదని త్రివిక్రమ్ తన సన్నిహితులతో ఎప్పుడూ అంటూ ఉంటాడట.