మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన మహేశ్ బాబు.. ఆ లక్కి డైరెక్టర్ ఎవరంటే..?

అబ్బబ్బ .. ఇది నిజంగా మహేష్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్ అని చెప్పాలి . ప్రజెంట్ మహేష్ బాబు ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకొని ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . రెండు షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో మరో బిగ్ పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయ్యాడు మహేష్ బాబు .

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది . జనవరి ఒకటో వారంలో ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్స్ రిలీజ్ కానున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కరెక్ట్ గా ఇలాంటి టైం లోనే మహేష్ బాబు కి సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ లీకైంది. మరో పాన్ ఇండియా సినిమాకు డైరెక్టర్ కు మహేశ్ బాబు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది . ఆయన మరెవరో కాదు పుష్ప సినిమాతో తన పేరుని మారుమ్రోగిపోయే విధంగా చేసుకున్న పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ .

ఆయన డైరెక్షన్లో ఓ సినిమాకి మహేష్ బాబు కమిట్ అయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఎస్ఎస్ రాజమౌళి సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమాకు కమిట్ అవుతున్నారట. ఇప్పటికే కధ మెయిన్ లైన్ మహేష్ బాబుకి కూడా చెప్పేసాడట సుక్కు. చాలా అట్రాక్టివ్ గా ఉందిఅని తెలుస్తుంది. ఇప్పటివరకు మహేష్ బాబును మనం చూడని సరికొత్త రోల్ లో ఆ సినిమాలో చూడబోతున్నామని చెప్పుకొస్తున్నారు జనాలు. ఏది ఏమైనా సరే మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ ఇలా ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లకి కమిట్ అవ్వడం అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది . చూడాలి మరి దీనికి సంబంధించిన
అప్డేట్ ఎప్పుడు వస్తుందో..?

Share post:

Latest