మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పిన ప్రభాస్..

డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2002లో విడుదల అయిన ‘ఈశ్వర్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రభాస్. ఆ తరువాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. దాంతో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ లోకల్ టు గ్లోబల్ లెవెల్లో భారీ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ ఖాతాలో మరిన్ని భారీ చిత్రాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా డార్లింగ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ లాక్ అవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సారి ప్రభాస్ ప్రముఖ టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి కి ఛాన్స్ ఇవ్వడం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

విరిద్దరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టుగా సమాచారం. పైగా ఈ చిత్రం పై అఫీషీయల్ అనౌన్సమెంట్ కూడా త్వరలోనే ఉండొచ్చని రూమర్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ నుంచి రెండు మాసివ్ ప్రాజెక్ట్ లు రానున్నాయి. అవే “ఆదిపురుష్”, “సలార్” సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనున్నాయి. ఈ సినిమాల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరీ ఈ చిత్రాలు ప్రభాస్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తాయో లేదో చూడాలి.