బావతో సౌందర్య పెళ్లి.. తర్వాత ఇన్ని కష్టాల.. ఎవరికి తెలియని సంచలన విషయాలు ఇవే..!

దివంగత కన్నడ నటి సౌందర్య అభినవ సావిత్రిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఒకప్పుడు మహానటి సావిత్రి ఎంత గొప్పదో… ఆ తర్వాత ఆ స్థాయిలో పేరు సౌందర్యకు మాత్రమే వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు 15 సంవత్సరాలపాటు తన క‌నుసైగ‌ల‌తో సౌందర్య శాసించిందని చెప్పాలి. అప్పటి తరం స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ – మోహన్ బాబు – శ్రీకాంత్ – జగపతిబాబు – సాయికుమార్ ఇలా ప్రతి ఒక్క హీరోతోను ఆమె నటించింది.

Soundarya house: లెజెండరీ హీరోయిన్ సౌందర్య ఇంటికి అంతటి దారుణమైన గతి  పట్టిందా..? | Late legendary actress Soundarya house was like a booth  bungalow now and here the details pk– News18 Telugu

స్టార్ హీరోల్లో ఒక బాలకృష్ణతో మాత్రమే టాప్ హీరో సినిమాలో ఒక్కసారి మాత్రమే నటించగా… మిగిలిన హీరోలతో ఆమె నాలుగైదు సినిమాలు చేయటం విశేషం. అప్పట్లో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తమ సినిమాలో సౌందర్య ఉండాలని పట్టుబట్టేవారు. ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్ సౌందర్యకు విపరీతంగా ఉండడంతో.. స్టార్ హీరోలు సైతం సౌందర్య త‌మ‌ సినిమాలో ఉంటే… తమ సినిమాలకు అదిరిపోయే కలెక్షన్లు వస్తాయని… ఫ్యామిలీ ఆడియెన్స్‌ వస్తారని లెక్కలు వేసుకునేవారు.

సినిమా సెట్స్​లో సౌందర్య అలా కూడా ఉండేవారా, interesting fact about actress  soundarya

ఇటు దర్శ‌కులు, నిర్మాతలు కూడా సౌందర్య తమ సినిమాల్లో కచ్చితంగా ఉంటే సినిమాకు ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోతుందని ఊహల్లో ఉండేవారు. ఈ విషయ‌మే సౌంద‌ర్య క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో తెలుపుతున్నాయి. అయితే సౌంద‌ర్య గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు అనుభ‌వించి.. ఎంతో క‌ష్ట‌ప‌డి ఆ స్థాయికి చేరుకుంద‌ని అంటారు.

ఇప్పటి వరకు ఎవరు చూడని సౌందర్య పెళ్లి ఫోటోలు ఇవే Actress Soundarya Wedding  Photos || Maata MUCHATA - YouTube

ఆమె క‌ష్ట‌ప‌డిన‌న్నీ రోజులు సుఖం లేకుండా పోయింద‌ని… ఆమె ఎంత సంపాదించినా దానిని అనుభ‌వించే టైం ఆమెకు లేదు. అయితే చివ‌ర‌కు త‌న సొంత బావ‌ను పెళ్లి చేసుకుని.. అప్పుడే హాయీగా లైఫ్‌ను ఆస్వాదించాల‌నుకుంటోన్న టైంలోనే ఆమె ఈ లోకాన్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఇక సౌంద‌ర్య హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందిన‌ప్పుడు ఆమె గ‌ర్భ‌వ‌తిగా కూడా ఉన్నారు.

Soundarya Biopic: సౌందర్య బయోపిక్ రాబోతుందా.. లెజెండరీ హీరోయిన్ పాత్రలో  నేటి మహానటి..? | Remembering late actress Soundarya on her 49th Birth  Anniversary and talks going round about her biopic pk ...

అప్ప‌ట‌కీ ఆమెకు పెళ్ల‌య్యి యేడాది కూడా కాలేదు. జీవితంలో క‌ష్ట‌ప‌డి.. కావాల్సినంత పేరు ప్ర‌ఖ్యాతుల‌తో పాటు కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్న ఆమె ఆస్తులు కూడా బాగానే కూడ‌బెట్టుకున్నారు. అయితే దానిని అనుభ‌వించి, సుఖ‌ప‌డే టైం వ‌చ్చేస‌రికి దేవుడు ఆమెను పై లోకాల‌కు తీసుకువెళ్లిపోయారు.

Share post:

Latest