ఆరోజు అలా చేశా..ఈరోజు ఇలా ఉన్న: కృతి సనన్..!!

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. టాలీవుడ్ కి కూడా సుపరిచితమే మొదట నేనొక్కడినే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన అది పురుష్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

Kriti Sanon Gives A Perfect Response To The Paps On Being Asked 'Aapka  Partner Nahi Hai'
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న కృతి సనన్ తన కెరియర్ ప్రారంభంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను సైతం తెలియజేస్తోంది. తొలిసారి ఫోటోషూట్ లో పాల్గొన్నప్పుడు తన కాళ్లు చేతులు ఉనికి అని ఆరోజు ఇప్పటికీ గుర్తు ఉందని ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోనని తెలియజేస్తోంది. కెమెరా ముందుకు వెళ్ళగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాను.. తనలో ఆ భద్రత భావమే అలాంటి పని చేయించిందని..ఇంటికొచ్చి చాలా ఏడ్చాను షూట్లో బాగా చేశానా లేకపోతే తప్పులు ఏమైనా ఉన్నాయా అంటూ చాలా బాధపడిందట.

Kriti Sanon's saree at Adipurush's trailer launch has a 24-carat gold print  | Filmfare.com
ఆ తర్వాత నెమ్మదిగా రకమైన అనుభవాలు ఎదురయ్యేసరికి అలవాటు చేసుకోవాలో నేర్చుకున్నాను అప్పుడే అర్థమైంది విజయాలంటే అపజయాలు ఎన్నో విషయాలు నేర్పిస్తాయి అంటూ తెలిపింది. అంతేకాకుండా డైరెక్టర్ ఏమనుకుంటారో అంటూ ఆలోచిస్తూ ఉండేదాన్ని అంటూ తెలిపింది. అయితే ఆ తర్వాత తప్పుల నుంచి ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదని దృఢనిచ్చయంతో ముందుకు వెళ్లానని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని తెలుపుతోంది కృతి సనన్.

Share post:

Latest