బన్నీ తలరాతనే మార్చేసిన హిట్ సినిమాను ..మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి ఫేలో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బన్నీ .. తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా సరే బన్నీ సినిమా ఆయన కెరియర్ లోనే ప్రత్యేకంగా నిలిచింది . ఎందుకంటే అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ గా ఉన్న బన్నీని ఆ సినిమా నుండి బన్నీ అంటూ పిలవడం మొదలుపెట్టారు . ఈ సినిమాల్లో బన్నీ లుక్స్ ..డైలాగ్స్ ..యాక్షన్ సీన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ అల్లు అర్జున్ అంటే కన్నా బన్నీ అంటేనే ఎక్కువ జనాలు గుర్తుపడతారు .

కాగా ఆయన కెరియర్ లో ఇంతటి క్రేజీ హిట్ ఇచ్చిన ఈ సినిమాను లో హీరోగా అనుకుంది మొదట నితిన్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . 2005 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది. అప్పట్లో ఈ సినిమా దాదాపు 20 కోట్లు కలెక్ట్ చేసినట్లు న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హీట్ అందుకున్న అల్లు అర్జున్ .. అప్పటినుంచి బన్నీ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు అభిమానులు .

డైరెక్టర్ వి వి వినాయక్ మొదట ఈ కథను నితిన్ కి వివరించారని.. అయితే వివి వినాయక్ చెప్పిన కథ నితిన్ బుర్రకి ఎక్కకపోవడంతో .. ఈ సినిమాను రిజెక్ట్ చేశాడని .. ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత .. అయ్యయ్యో రిజెక్ట్ చేసానా అంటూ బాధపడ్డాడట . ఈ క్రమంలోనే నితిన్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాని బన్నీ చేసి రికార్డుల మోత మోగించేసాడు . ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ..అంటే దానికి వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ బన్నీ మూవీ అని చెప్తున్నారు జనాలు. కాగా రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ యూట్యూబ్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే..!!