“ఆషూరెడ్డితో లవ్”.. ఫస్ట్ టైం ఓపెన్ అప్ అయిన రాహుల్ సిప్లిగంజ్..!!

రాహుల్ సిప్లిగంజ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరమా చెప్పండి . రీసెంట్ గానే ఆయన పాడిన పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. కేవలం తెలుగు ఇండస్ట్రీలో.. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ స్టార్ సింగర్ . గల్లీ సింగర్ గా పేరు సంపాదించుకున్న రాహుల్.. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా తన పేరుని పాపులారిటీ చేసుకున్నాడు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆయన పాడిన నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడమే .

రాహుల్ సిప్లిగంజ్ మొదటి నుంచి చాలా ఓపెన్ అప్ అని అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఆయన పేరు బిగ్ బాస్ సీజన్లోకి అడుగుపెట్టిన తర్వాతే అందరి జనాలకి తెలిసింది . ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో పునర్నవి భూపాలం అనే కంటెస్టెంట్ తో ప్రేమాయణం నడిపాడు రాహుల్ అని వార్తలు వినిపించాయి . ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన రాహుల్ తన పై వచ్చిన రూమర్స్ కి క్లారిటీ ఇచ్చాడు. పునర్నవి భూపాలంతో మీ ప్రేమా నిజమేనా..? అంటూ ఎదురైన ప్రశ్నకి అలాంటిది ఏం లేదు ..బిగ్ బాస్ లో మీకు అలా కనిపించిందేమో ..బయట మేము చాలా మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చాడు .

అంతే కాదు పునర్నవి భూపాలం ప్రెగ్నెంట్ అంట కదా..? దానిపై మీ స్పందన ఏంటి ..? కొందరు మీరే కారణం అంటున్నారు అంటూ ప్రశ్నించగా .. “నాకు సంబంధం ఏంటి..? అయిన పునర్నవి భూపాలం ప్రెగ్నెంట్ ఏంటి..? అలాంటిదేమీ లేదు.. ఆమె మంచి అమ్మాయి “అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆషూ రెడ్డితో దిగిన క్లోజ్ పిక్స్ గురించి హోస్ట్ ప్రశ్నించగా..” క్లోజ్ గా దిగినంత మాత్రాన మేము ప్రేమించుకుంటున్నాము అని అనుకోవడం వారి పొరపాటే.. మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆమె దగ్గర హెల్ప్ తీసుకున్న వారిలో నేను కూడా ఒకరిని.. ఆషూ చాలా మంచి అమ్మాయి.. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది ..మేము ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ గానే ఉంటాం ..మా మధ్య ఏదో ఉంది అనుకునేవాళ్ళు అనుకోనివ్వండి.. నేనేం చేయలేను ” అంటూ కొట్టి పడేసాడు. ఈ క్రమంలోనే రాహుల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!