సినీ చరిత్రలోనే ఇది ఓ కని విని ఎరుగని రికార్డ్.. వార్ 2 కోసం తారక్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు అందుకోవడం ఒక ప్లస్ అయితే.. ఎన్టీఆర్ తన కెరియర్ లోనే ఫస్ట్ టైం విలన్ పాత్రను పోషించడానికి సైన్ చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఎస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో విలన్ రోల్స్ చేయడానికి పచ్చ జెండా ఊపాడు.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 2019లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ . ఈ సినిమా ఎంతటి పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్ము దులిపేసింది . సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టాక్ ని నమోదు చేసుకుని బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది . తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అని రీసెంట్గా వెల్లడయింది . ఈ క్రమంలోని తెలుగు ఇండస్ట్రీలోనూ ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది . కాగా రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఓ విలన్ పాత్ర చేస్తున్నందుకు గాను 100 కోట్లు అందుకుంటున్నాడు తారక్.

ఇప్పటివరకు విలన్ పాత్ర చేసిన ఏ నటుడు కూడా ఇంత పెద్ద పారితోషకం తీసుకోలేదట . సినీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం తారక్ రికార్డు నెలకొల్పబోతున్నాడు . అంతేకాదు సినిమాలో హీరోగా చేస్తున్న హృతిక్ రోషన్ కూడా 100 కోట్లు తీసుకుంటున్నాడు . ఈ క్రమంలోని ఫస్ట్ టైం హీరోకి ఎంత ఇస్తున్నారో విలన్ కి కూడా అంతే పారితొషకం అందుకుంటున్న సినిమాగా తారక్ సంచలన రికార్డు నెలకొల్పిబోతున్నాడు. రిలీజ్ అవ్వకముందే ఇలాంటి రికార్డ్స్ నెలకొల్పుతున్న వార్ 2 రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డును బ్రేక్ చేస్తుందో.. ఎలాంటి వార్ ని క్రియేట్ చేస్తుందో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . నిజంగా ఇది నిజమైతే మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని హైయెస్ట్ విలన్ గా తారక్ రికార్డ్ సృష్టించినట్లే అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!