ఫ్యాన్స్‌ని డార్లింగ్స్‌ అని ముద్దుగా పిలుస్తూ రష్మిక స్పెషల్ వీడియో రిలీజ్!

టాలీవుడ్ తో సహా కోలీవుడ్, బాలీవుడ్ రంగాలను దున్నేస్తున్న రష్మిక మందన్న రోజు తన 27వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌తో ఒక స్పెషల్ వీడియో మెసేజ్‌ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో, రష్మిక తన ఫ్యాన్స్‌ను ‘డార్లింగ్, లవ్స్’ అని చాలా క్యూట్‌గా, ముద్దుగా పిలుస్తూ వారి మనసులను పులకరింపజేసింది. తన అభిమానులను వారు ఎలా ఉన్నారని అడిగింది. ఈరోజు బ్యాడ్ డే అయినా బాధపడొద్దని కొండంత ఆత్మవిశ్వాసం నింపింది.

రష్మిక మాట్లాడుతూ, ” మీకు ఈరోజు అంత గొప్పగా సమయం గడపకుంటే పడకండి ఎందుకంటే ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది.” అని చెప్పుకొచ్చింది. రష్మిక తన అభిమానుల పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది. ఫ్యాన్స్ తనను ఎంతగా ప్రేమిస్తారో వారిని కూడా తాను అంతే ప్రేమిస్తానని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ రోజు తాను ఈ స్థాయి రావడానికి అభిమానులే కారణమని చెప్పింది. అందుకు వారికి ధన్యవాదాలు. తెలియజేసింది. తరువాత ఆమె నవ్వుతూ వీడియో ముగించింది. ఈ వీడియోలో రష్మిక చాలా ముద్దుగా కనిపించింది.

 


రష్మిక తన అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వీడియో మెసేజ్ పెట్టింది. ఇకపోతే రష్మిక శాంతరూబన్ దర్శకత్వంలో దేవ్ మోహన్ నటిస్తున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం రెయిన్ బోలో మెయిన్ లీడ్ రోల్ చేయనుంది. ఇక పుష్ప 2 మూవీలో శ్రీవల్లి పాత్రను తనే మళ్లీ పోషిస్తుంది. ఈ సినిమాలోని ఆమె లుక్కుకు సంబంధించి ఒక పోస్టర్‌ను టీమ్‌ ఈరోజే రిలీజ్ చేసింది. అది అభిమానులను ఎంతగానో సంతోషపరిచింది. ఈ తరుణంలో రష్మిక పాత్ర ఎంత బాగుంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.