బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్.. డిప్రెషన్ లో పూజా హెగ్డే అలాంటి ప‌ని చేసిందా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఎంత‌లా న‌లిగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు పూజా హెగ్డే ఖాతాలో ప‌డ్డాయి. రాధేశ్యామ్ తో ప‌ట్టుకుని ద‌రిద్రం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది.

ఆచార్య‌, బీస్ట్‌, స‌ర్క‌స్‌తో పాటు రీసెంట్ గా విడుద‌లైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. దీంతో పూజా హెగ్డేను ఐరెన్ లెగ్ అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దీంతో పూజా పేరు ఎత్తాలంటే మేకర్స్ భయపడే పరిస్థితి నెలకొంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఆశ‌ల‌న్నీ `SSMB 28` పైనే పెట్టుకుంది. మ‌హేష్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

ఇందులో శ్రీ‌లీల మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో కానీ.. షూటింగ్ కు వ‌రుస బ్రేకులు ప‌డుతూనే ఉన్నాయి. షూటింగ్ కి డుమ్మా కొట్టి మహేష్ ప‌దే ప‌దే విదేశాలకు చెక్కేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆసక్తి మహేష్ కి లేదనే టాక్ కూడా న‌డుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పూజా హెగ్డే డిప్రెషన్ కి గురయ్యారట. ఈ డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆమె ఒంట‌రిగా శ్రీలంక టూర్ కి వెళ్లిపోయింద‌ట‌. అక్క‌డ కొద్ది రోజులు ప్ర‌శాంతంగా గ‌డ‌పాల‌ని బుట్ట‌బొమ్మ డిసైడ్ అయింద‌ట‌. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా ఎలా ముందుకు వెళ్లాలి అని ప్లాన్ చేసుకోనుంద‌ట‌.

Share post:

Latest