“ఆ హీరోని చూసుకుని నేర్చుకో రా అఖిల్”.. అక్కినేని వారసుడికి ఇంతకంటే ఘోర అవమానం ఉంటుందా..?

స్పై జాన‌ర్‌లో సినిమా అంటేనే క‌థ క‌థ‌నంలో ఎంతో క‌స‌ర్తు చేసుకోవాలి. హీరో, నిర్మ‌త‌ దొరిరాడు అని సినిమా చేస్తే ప్రేక్ష‌కులు తిప్పి కోట్ట‌డం ఖాయం. తాజాగా నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అఖిల్ ఏజెంట్ సినిమా ఇందుకు పెద్ద ఉద‌హ‌ర‌ణ‌. ఈ సినిమా విష‌యంలో అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. త‌న న‌ట‌న‌లో కూడా ఎన్నో మ‌ర్పులు తిసుకు వ‌చ్చాడు. ఆస‌లు లోపం అంత కథ , కథనం, డైరెక్షన్ లోనే ఉంది.

Akhil Akkineni's Action-packed Poster From Pan India Film Agent, Teaser On  July 15th - Akhil Akkineni, July, Mammootty, Sakshi Vaidya, Surender Reddy  | Akhil Akkineni's Action-packed Poster From Pan India Film Agent,

అస‌లు వ‌క్కంతం వంశీ ఇచ్చిన క‌థ‌ను పెట్టుకున్ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి మొద‌ట త‌ప్పు చేశాడు.. ఆ క‌థ‌కు ఎలాంటి కిక్ ఇవ్వ‌ని స్క్రీన్ ప్లే తో సినిమా తీయ‌డం మ‌రో పెద్ద త‌ప్పు. లాజికులు ప‌క్క‌న పెట్టి స్పై సినిమాను ఏదో యాక్ష‌న్ సినిమాల చేస్తే ఎలా ? హెలీ కాప్టర్స్, ఖరీదైన కారులు, విదేశాల్లో షూటింగ్ చేస్తే సరిపోతుందా ? అసలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే కంటెంట్ ఉండన్నక్కర్లేదా ?

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న `ఏజెంట్` ఆగస్టు  12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ | akkineni akhil surender reddy agent  movie ...

ఈ త‌ర‌హ సినిమాలు చేసిన హీరోలు చాలా అరుదు. సీనియర్ హీరోలో సూప‌ర్ స్టార్ కృష్ణ‌, ఈ త‌రం హీరోలో అడివి శేష్ లాంటి వారు మ‌త్ర‌మే ఈ లాంటి సినిమాలు చేశారు. యంగ్ హీరో అడివి శేష్ గూడాచారితో హ‌లీవుడ్ త‌ర‌హ స్పై థ్రిల్ల‌ర్ సినిమా చూపించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నాడు.

కనీసం ఇలాంటి స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ఆయ‌న‌ అడివి శేష్ ఏలా చేశాడు ? ఎలాంటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ? అని తెలుసుకోవాలి కదా. ఎక్క‌డో హ‌లీవుడ్‌లో కాదు మ‌న తెలుగు హీరోనే ఉన్న‌డు క‌దా. ఇలాంటి జోన‌ర్ సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌ళ్లీ దానికి సీక్వెల్ ప్లాన్ చేసుకుంటూ స్క్రిప్ట్ మీదే కొన్ని నెలలు నుంచి వర్క్ చేస్తున్న శేష్ నుంచి అఖిల్ ఎంతో నేర్చుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.