కర్మ కర్మ..అప్పుడు తారక్.. ఇప్పుడు బన్నీ అదే తప్పు.. వీళ్ళని మార్చలేం రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ స్టేటస్ కి తగ్గ రోల్స్ కోసం వెయిట్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఫాన్స్ ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు . అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్టార్స్ వేరే సినిమాల్లో గెస్ట్ పాత్రలో నటించడానికి ససే మీరా నో చెప్తున్నారు . అవతలి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఎంత డైరెక్ట్ అయినా సరే కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా.. ఆ పాత్రను రిజెక్ట్ చేసి పక్కన పడేస్తున్నారు .

స్టేటస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ తగ్గేదేలే అన్న రేంజ్ లో బిహేవ్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు బన్నీ . నిన్న మొన్నటి వరకు వేరే హీరో సినిమాలలో గెస్ట్ రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు . ఎప్పుడైతే పాన్ ఇండియా స్టేటస్ ట్యాగ్ వచ్చిందో అప్పటినుంచి బన్నీ కూడా వేరే సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . ఈ క్రమంలోనే రీసెంట్ గా కోలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయమని ఆఫర్ ఇచ్చిన రిజెక్ట్ చేశాడు .

అంతేనా రీసెంట్గా బాలీవుడ్ బడా ప్రాజెక్టులో గెస్ట్ రోల్ ఆఫర్ ఇచ్చినా.. ఏకంగా కోట్లు ఇస్తామన్న బన్ని రిజెక్ట్ చేసి పడేసాడట . కాగా ఇదే క్రమంలో మొదట వార్ 2 సినిమా ను కూడా తారక్ రిజెక్ట్ చేశాడని ..కానీ ప్రశాంత్ నీల్ దగ్గరుండి ఈ ప్రాజెక్టును ఓకే చేయించాడని ..ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోని మిగతా హీరోలు కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న టాక్ ఎక్కువుగా వినిపిస్తుంది. అయితే అలాంటి హీరోలను ఇక మార్చలేము రా బాబు అంటూ జనాలు సైతం మండిపడుతున్నారు . ఓ హీరో అన్నాక మరో హీరోకి హెల్ప్ చేయాలి …సజెస్ట్ చేయాలి …గెస్ట్ రోల్ లో నటించాలి ..అప్పుడే సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది .. పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!