టాలీవుడ్ టాప్ హీరోయిన్ల క‌ళ్లు తిరిగే రెమ్యున‌రేష‌న్లు ఎంతో తెలుసా..!

తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గ‌ర కూడా ముద్దుగుమ్మ‌లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం తెలుగులో ఎవ‌రెవ‌రు ఎంత పారితోషికం అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.

Is this Samantha first salary?

ఇక టాప్ హీరోయిన్లు అయితే సినిమా సినిమాకు రెమ్యూనరేషన్లు పెంచేస్తూ చుక్కలు చూపించేస్తున్నారు. నాగచైతన్యకు విడాకులు ఇచ్చాక సమంత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు మూడు కోట్లు డిమాండ్ చేస్తుంది. ఇక పెళ్లయినా కూడా నయనతార డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. పెళ్లికి ముందే ఆమె ఒక్కో సినిమాకు ఆరు కోట్ల వరకు తీసుకుంది. అయితే ఇప్పుడు కూడా నయనతార ఆరు కోట్లు ఇస్తేనే సినిమాకు కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది.

Tollywood Female Actors' Remuneration: Do you Know Who Tops the List?

ఇక నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్న చెన్నై అందం త్రిష కూడా రూ. 5 కోట్లు చేస్తున్న పరిస్థితి. త్రిష‌కు తెలుగులో పెద్దగా డిమాండ్ లేదు.. ఆమెకు తక్కువ అవకాశాలు వస్తున్నా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. ఇక రష్మిక ఛ‌లో సినిమాకు కేవలం 30 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంది. ఇప్పుడు అదే రష్మిక ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేయడంతో పాటు తనతో పాటు వచ్చే సిబ్బంది ఖర్చులు కూడా భరించాలని నిర్మాతలకు కండిషన్లు పెడుతున్న స్థితికి వచ్చేసింది.

పూజా హెగ్డే నిన్న మొన్నటి వరకు నాలుగు కోట్లు తీసుకుంది. అయితే ఇప్పుడు వరుసగా ప్లాప్‌లు రావడంతో ఒక మెట్టు వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్- మహేష్ సినిమాకు పూజకు నాలుగు కోట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల‌ తొలి సినిమాకు కేవలం 25 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకోగా.. ఇప్పుడు ఆమె కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా డిమాండ్ ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సూత్రాన్ని మన టాలీవుడ్ హీరోయిన్లు బాగా వంట పట్టించుకున్నారు.