దేవుడి కాన్సెప్ట్ తో వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన సినిమాలు ఇవే..!

చిత్ర పరిశ్రమలో వచ్చే ఒక్కో సినిమా ఒక్కో బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. కొన్ని సినిమాలు లవ్ స్టోరీ తో వచ్చి సూపర్ హిట్ అందుకుంటే. మరికొన్ని సినిమాలు ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ ఇలా ఒక్కో బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అందుకుంటాయి. అయితే దేవుడి కాన్సెప్ట్ లో వచ్చి ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సినిమాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

దేవుడి కాన్సెప్ట్ తో వ‌చ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన 5 సినిమాలు ఇవే..!

గత సంవత్సరం నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ2 సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో సంచనాలు సృష్టించింది. ఈ సినిమా ప్రధానంగా ద్వారకా బ్యాక్ డ్రాప్ లో శ్రీకృష్ణుడి నేపథ్యంలో వచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి చిన్న సినిమాగా వచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించిన సినిమా కాంతారా. ఈ సినిమాలో క‌ర్నాట‌క‌లోని ఓ తెగ‌వారు పూజించే దేవిడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కి భారీ క‌లెక్ష‌న్ ల‌ను రాబ‌ట్టింది. కేవ‌లం క‌న్న‌డ‌లోనే కాకుండా తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లోనూ ఈ సినిమా విజ‌యం సాధించింది.

Everyone Watched Kantara 2, Now Get Ready To Watch Kantara 1," Says Rishab  Shetty Adding That The Film Will Be Made On A Vast Scale!

ఇక‌ నట‌సింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మూడో సినిమా అఖండ. ఈ సినిమా కూడా దేవుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య ఏకంగా అఘోరా గెటప్ లో నటించారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇలా ఈ మధ్యకాలంలో దేవుడు కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలన రికార్డులు సృష్టించాయి.