భ‌యంతో ఆ త‌ప్పు చేశాన‌ని ఒప్పుకున్న అనుప‌మ‌.. ఇప్పుడు బాధ‌ప‌డి ఏం లాభం?

అనుపమ పరమేశ్వరన్.. ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ‌లో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. కెరీర్ ఆరంభం నుంచి పాత్ర‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటేనే అనుప‌మ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేది. రొమాంటిక్ స‌న్నివేశాల‌కు, గ్లామ‌ర్ షోకు దూరంగా ఉంటూ వ‌చ్చింది. కానీ, ఈ మ‌ధ్య‌ కాలంలో రొమాంటికి సీన్స్ కు సై అంటోంది. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో త‌ర‌చూ కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది.

అడ‌పా త‌డ‌పా సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసేందుకు కూడా ఒప్పుకుంటుంది. అయితే ఇంత‌లా అనుప‌మ‌లో మార్పు రావ‌డానికి కార‌ణం ఉంద‌ట‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంపై అనుప‌మ ఓపెన్ అయింది. `2021 కి ముందు నేనొక గందరగోల పరిస్థితిలో ఉన్నాను. ఆ టైంలో నేను చేసిన ఫ్రీడమ్ మిడ్‌నైట్ అనే షార్ట్ ఫిలిం నాలోని అనేక భ‌యాల‌ను, అపోహలని పోగొట్టింది. నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇలాంటి బోల్డ్ పాత్ర‌లు చేస్తే ప్రేక్షకులు నన్ను ఎలా స్వీకరిస్తారో.. ఇండస్ట్రీ వాళ్లు ఏం అనుకుంటారో అన్న భయంతో ఎన్నో పాత్రలు వదులుకొని తప్పు చేశా.

అందుకు ఎంతో బాధ‌ప‌డ్డా. అప్పుడే నా మనసుకు నచ్చింది ధైర్యంగా చేస్తే తప్పేంటి అనిపించింది. అందుకే న‌న్ను నేరు మార్చుకున్నా. నా ప్రయాణం వైవిధ్యాపరితంగా ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాను. నా పాత ఇమేజ్ ను పూర్తిగా చెరిపేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా. అలాగే ఒక్క సీన్ ఉన్న పాత్రైనా సరే అది మనసుకు నచ్చిందంటే చాలు ఓకే చెబుతున్నా` అంటూ అనుప‌మ చెప్పుకొచ్చింది. దీంతో అనుప‌మ కామెంట్స్ కాస్త వైర‌ల్ గా మారాయి.