విజయశాంతికి గ్రాండ్ పార్టీ ఇచ్చిన చిరు… షాకింగ్ స‌ర్‌ఫ్రైజ్ కూడా…!

1980 – 90వ దశకంలో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుని స్టార్ హీరోలకి చెమటలు పట్టించిన నటి విజయశాంతి. ఈమె ఆ రోజుల్లో చిరంజీవికి జంట‌గా ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలో న‌టించింది. అయితే చిరు 90లో విజ‌య‌శాంతి కోసం ఓ బ్రహ్మాండమైన పార్టీని అరేంజ్ చేశారట. చిరు, విజ‌య‌శాంతి కొసం పార్టీ ఏంటీ అనుకుంటున్నారా ? చిరు విజ‌య‌శాంతికి ఆ సర్‌ప్రైజ్ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.

Vijayashanti: విజయశాంతి బర్త్ డే స్పెషల్.. ఆ రెండు సినిమాల తర్వాత స్టార్స్‌కు దూరంగా..

అయితే అది ఇప్పుడు కాదు.. దాదాపు 32 సంవత్సరాల క్రితం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం ఇప్పుడెలా గుర్తొచ్చింది అని అంటే ఆ విషయాన్ని స్వయంగా విజయశాంతి ఓ ఇంటర్వ్యూలు తెలిపింది. మే 9 1991 లో చిరు-విజ‌య‌శాంతి కాంబోలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ సినిమా గ్యాంగ్‌లీడ‌ర్ ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన కొన్ని ఘటనలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంది విజ‌య‌శాంతి.

ఆ రీజన్ వల్లే చిరంజీవి విజయశాంతితో ఎక్కువ సినిమాలు చేశారా | Actress Vijayashanti Make More Films With Megastar Chiranjeevi Details, Chiranjeevi, Interesting Facts, More Films, Vijayashanti, Mechanic ...

గ్యాంగ్ లీడర్ సినిమాలో భద్రాచలం కొండపాట షూటింగ్ జరుగుతున్నప్పుడు కర్తవ్యం సినిమాలో త‌న నటనకు ఉత్తమ నటి అవార్డు వచ్చిందన్న విషయం తెలిసిందే. అప్పుడు అదే స‌మ‌యంలో చిరు గ్యాంగ్‌లీడ‌ర్ సినిమా షూటింగ్ అయిన వెంట‌నే ఓ పెద్ద పార్టీని ఏర్పాటు చేశార‌ట. ఈ పార్టీకి బాలీవుడ్ న‌టులు గోవిందా, దివ్యభారతిలను కూడా పార్టీకి పిలిచి విజయశాంతిని చిరు సర్ప్రైజ్ చేశారట.

Karthavyam (1990) - IMDb

ఈ సందర్భంగా చిరంజీవిని పొగడ్తలతో ముంచేత్తుంది ఈ ముద్దుగుమ్మ ఇప్పటి హీరోలు డాన్సులు బాగా చేస్తున్న చిరు స్టైల్ ని మించిన వారు ఎవరూ లేరని విజయశాంతి చెప్పుకొచ్చింది. ఇక విజయశాంతి విషయానికి వస్తే స్టార్ హీరోలకే పోటీగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్ సినిమాల‌తో టాలీవుడ్‌ని షేక్ చేసింది.

Chiranjeevi - Vijayashanti: చిరంజీవి,విజయశాంతి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ జోడి.. | Megastar Chiranjeevi Lady Super Star vijayashanti hit pair in tollywood these are the films they act together Here Are The List ...

మరోవైపు చిరంజీవి విషయానికి వస్తే ఆరుపదుల వయసులో కూడా అంతే స్పీడుతో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం భోళా శంకర్ సినిమాతో త్వరలోనే ప్రేక్ష‌కుల‌ ముందుకు రానున్నారు.