ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ హీరో డైరెక్టర్ హవా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే రాజమౌళి తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ,అల్లు అర్జున్, యశ్ తదితర నటులు డైరెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను బాగా సంపాదించుకున్నారు. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై రికార్డులను బ్రేక్ చేసింది కాంతారా చిత్రం ఈ సినిమాతో హీరోగా డైరెక్టర్ గా పరిచయమయ్యారు రిషబ్ శెట్టి.. ఈ సినిమా ఒక్క క్రేజీతో ఈయన క్రేజ్ మారిపోయింది. ఇటీవల ఆయన ఇంటర్వ్యూ కోసం నేషనల్ మీడియా సైతం క్యూ కట్టింది తర్వాత రిషబ్ చేయబోయే నెక్స్ట్ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి…
ఇక ఇదే సమయంలో రీషబ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తనపై వచ్చిన రాజకీయ వార్తల పైన తాజాగా కనడ పరిశ్రమలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. రిషబ్ శెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాడుకు చెందిన ఒక జర్నలిస్ట్ ట్వీట్ పై స్పందించడం జరిగింది.. హీరో.. తను రాజకీయాలలోకి రావడం అనేది నిజం కాదని.. అది తప్పుడు వార్త అని ..కొంతమంది నన్ను తమ పార్టీకి మద్దతుగా ఉండమన్నారు కానీ నేను రాజకీయాలలోకి మాత్రం రాను అని తెలియజేశారని తెలిపారు రేషబ్.
అందుకు సంబంధించి ఈ ట్విట్ స్పందిస్తూ ఒక అభిమాని మీరు రాజకీయాలలోకి రండి నేను మద్దతు ఇస్తానంటూ కామెంట్లు చేశారు.. ఇందుకు రిషబ్ స్పందిస్తూ.. నాకు పొలిటికల్ సపోర్టు వద్దు కానీ నా సినిమాకు మద్దతు ఇవ్వండి మూవీస్ చూసేందుకు థియేటర్లకు రండి అంటూ కామెంట్స్ చేశారు.. గతంలో ఎన్నోసార్లు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చానని తెలిపారు రిశబ్.. కాంతార చిత్రం విడుదలైన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ కాంతార చిత్రంలో చూపించిన దేవుడు అరుపులను ఎవరు కూడా అపహేళన చేయొద్దని కోరుకుంటున్నారు రిషబ్ శెట్టి..