బాలయ్య- రోజా కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే.. మరి ఇంత క్రేజ్ ఏంటి..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 107 సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించాడు. చాలా మంది హీరోయిన్ల‌తో బాల‌య్య‌ది హిట్ ఫెయిర్‌. ఇక రోజా – బాల‌య్య కాంబినేష‌న్ అంటేనే అప్ప‌ట్లో తిరుగులేనిఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్ద‌రిని తెర‌మీద చూసేందుకు తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపేవారు. వీరి కాంబినేష‌న్లో మొత్తం 7 సినిమాలు వ‌చ్చాయి.

బాలయ్యకు ఫోన్ చేసిన రోజా.. మళ్ళీ వీళ్లిద్దరి రొమాన్స్ | Roja phone call to  Balakrishna.. here is interesting conversation

బాల‌య్య – రోజా కాంబోలో భైర‌వ‌ద్వీపం, గాండీవం, బొబ్బిలిసింహం – మాతోపెట్టుకోకు -శ్రీకృష్ణార్జున విజ‌యం – పెద్ద‌న్న‌య్య – సుల్తాన్ సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమాల్లో వ‌చ్చిన భైర‌వ‌ద్వీపం బాల‌య్య కెరీర్‌లో తొలి జాన‌ప‌ద సినిమా. ఇది సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత బొబ్బిలి సింహం కూడా సూప‌ర్ హిట్‌. ఒకే యేడాది రోజాతో మూడు సినిమాలు చేస్తే అందులో రెండు సూప‌ర్ హిట్ అయ్యాయి.

Peddannayya telugu | Sun NXT

 

అందులో ఒక‌టి జాన‌ప‌దం, రెండోది యాక్ష‌న్ మూవీ. భైర‌వ‌ద్వీపంకు సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌కుడు. బొబ్బిలిసింహంకు కోదండ రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర్వాత మాతో పెట్టుకోకు, శ్రీ కృష్ణార్జున విజ‌యం సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు ప్ర‌య‌త్నాల ప‌రంగా మెప్పించినా అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఆ త‌ర్వాత పెద్ద‌న్న‌య్య‌, సుల్తాన్ రెండు సినిమాలు కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేశాయి.

అప్ప‌ట్లో బాల‌య్య – రోజా కాంబినేష‌న్ అంటే ప్రేక్ష‌కుల‌లో కూడా ఓ క్రేజ్ ఉండేది. మ‌ళ్ళీ వీరీ కాంబోలో సినిమా వ‌స్తుందా లేదా అనేది చూడాలీ. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు బ‌ద్ద శ‌త్ర‌వుల రాజ‌కీయాంగా అడుగులు వేస్తున్నారు. ఇక రాబోయో రోజులు వారీ మ‌ధ్య ఏమీ జ‌రుగుంద అన్నీ అంద‌రు ఎంతో ఆస్తిగా ఎదురు చూస్తున్నారు.