`ఏజెంట్‌` విష‌యంలో ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న అఖిల్‌.. వ‌ర్కోట్ అయితే బ్లాక్ బ‌స్ట‌రే!

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా తెర‌కెక్కిన ఐదో చిత్రం `ఏజెంట్‌`. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 2 గంటల 36 నిమిషాల నిడివితో వ‌స్తోన్న ఈ చిత్రంలో స్పై ఏజెంట్ రామ‌కృష్ణ‌(రిక్కీ) పాత్ర‌లో అఖిల్ అల‌రించ‌బోతున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అఖిల్ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు.

అలాగే ఏజెంట్ విష‌యంలో తాను ఫాలో అవుతున్న ఓ సెంటిమెంట్ ను రివీల్ చేశాడు. ఏజెంట్ మార్చి 28న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌తంలో ఏప్రిల్‌ 28న పోకిరి, అడివి రాముడు, బాహుబ‌లి వంటి ఎన్నో స‌క్సెస్‌ఫుల్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందుకే ఏజెంట్ విడుద‌ల‌కు అలాంటి ల‌క్కీ డేట్ ను ఫిక్స్ చేశామ‌ని అఖిల్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. మ‌రి ఈ ల‌క్కీ డేట్ సెంటిమెంట్ ఏజెంట్ మూవీకి కూడా వ‌ర్కోట్ అయితే అఖిల్ కు బ్లాక్ బ‌స్ట‌రే అని అంటున్నారు.