రాజమౌళికి కార్తికేయ సొంత కొడుకు కాదా.. వారి మధ్య బంధం ఇదే

భారతదేశ సినీ అభిమానులు ప్రస్తుతం ఉప్పొంగిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. భారతదేశంలో అగ్రశ్రేణి డైరెక్టర్లలో ఒకరిగా లెక్కించబడిన ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ దాదాపుగా ఏడాది క్రితం మార్చి 2022న విడుదలైంది. ఆస్కార్‌ అవార్డుల పోటీలో అధికారిక ప్రవేశంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు చోటు దక్కలేదు. చిత్ర బృందం వారి స్వంత ప్రచారం ద్వారా ఆస్కార అవార్డు సాధించింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయరచయిత చంద్రబోస్ లను అంతా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమాలో నటించి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఊహించని ప్రజాదరణ దక్కుతోంది. అయితే ఆస్కార్ అవార్డు రావడంలో కార్తికేయ పాత్ర చాలా ముఖ్యమైనది.

ఎస్ఎస్ కార్తికేయ ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు. అతను తన తండ్రితో తన చిత్రాలలో అనేక రకాల పనులు చేస్తున్నాడు. అతనికి రాజమౌళి సినిమాలోని ఈగకు ప్రొడక్షన్ మేనేజర్గా కెరీర్ మొదలు పెట్టాడు. బాహుబలి, మర్యాద రామన్న సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో లైన్ నిర్మాతగా పనిచేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రాజమౌళికి రమతో 2001లో పెళ్లి జరిగింది. అప్పటికే రమకు మరో వ్యక్తితో వివాహమై విడాకులు కూడా జరిగిపోయాయి. రమకు, మరో వ్యక్తికి పుట్టిన కొడుకే కార్తికేయ. తర్వాత రమను ప్రేమించి రాజమౌళి పెళ్లి చేసుకున్నాడు. తమకు మరో బిడ్డ పుడితే తమ ప్రేమ కార్తికేయకు దక్కదేమోనని ఇక పిల్లలు వద్దనుకున్నాడు రాజమౌళి.


కార్తికేయ కూడా తండ్రికి చేదోడు వాదోడుగా, రాజమౌళి అన్ని సినిమాలలోనూ ఎన్నో బాధ్యతలు భుజాలపై మోస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ పోటీలో డైరెక్ట్ ఎంట్రీ దక్కలేదు. దీంతో ప్రమోషన్లు పెంచి నేరుగా పోటీలో పాల్గొనేలా కార్తికేయ చేశాడు. దీని కోసం విదేశాల్లో ఎంతో శ్రమించాడు. అతడి శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. అందుకే ఆస్కార్ అవార్డు అందుకున్న సమయంలో కీరవాణి స్టేజిపై కార్తికేయకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.