ఎన్టీఆర్ కెరీర్లో చేసిన అతి పెద్ద మిస్టేక్‌… ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిపోయాడు..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించాడు. గ‌త ఆరు సినిమాల నుంచి ఎన్టీఆర్‌కు ప్లాప్ లేదు. టెంప‌ర్‌తో మొద‌లు పెడితే త్రిబుల్ ఆర్ వ‌ర‌కు వ‌రుస‌గా అన్నీ హిట్లే..అయితే ఎన్టీఆర్‌కు టెంప‌ర్‌కు ముందు వ‌ర‌కు వ‌రుస ప్లాప్‌లు ప‌డ్డాయి. రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌, అంత‌కు ముందు శ‌క్తి, ఊస‌ర‌వెల్లి అన్నీ ప్లాప్‌లే.. మ‌ధ్య‌లో బృందావ‌నం మాత్ర‌మే హిట్‌గా నిలిచింది.

 

అంత‌కు ముందు ఎన్టీఆర్ కెరీర్ య‌మ‌దొంగ త‌ర్వాత కూడా చాల‌ డ‌ల్ అయ్యింది. ఆ టైమ్‌లో సురేంద‌ర్‌రెడ్డి కిక్ సినిమా స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించాడు. సురేంద‌ర్‌రెడ్డి ఫ‌స్ట్ సినిమా అత‌నొక్క‌డే. క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా, హీరోగా ఈ సినిమా తెర‌కెక్కింది. అందుకే సురేంద‌ర్‌రెడ్డి కిక్ స్టోరీ రెడీ చేసుకుని ముందుగా ఎన్టీఆర్‌కే చెప్పాడు. అయితే అప్పటికే వ‌రుస‌గా స్టార్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేస్తున్నా వ‌రుస ప్లాప్‌లు వ‌స్తుండ‌డంతో ఎందుకో ఎన్టీఆర్‌కు ఆ స్టోరీ న‌చ్చ‌లేదు. సురేంద‌ర్‌రెడ్డికి అప్ప‌టికే అశోక్ సినిమాతో ఛాన్స్ ఇచ్చినా క్లిక్ కాలేదు.

అందుకే మ‌ళ్లీ సురేంద‌ర్‌రెడ్డితో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఇష్ట‌ప‌డ‌లేదు. ఆ త‌ర్వాత సురేంద‌ర్‌రెడ్డి ఇదే క‌థ‌ని రెబల్ స్టార్ ప్రభాస్ కి వినిపించగా ఆయన కూడా నో చెప్పాడు. దీంతో సురేందర్ రెడ్డి చివ‌ర‌కు ర‌వితేజ‌కు చెప్పాగా అత‌ను ఓకే చేశాడు. ఇక హీరోయిన్‌గా ఇలియానాను తీసుకున్నారు. అప్ప‌టికే ఇలియానా ర‌వితేజ‌కు జంట‌గా ఖ‌త‌ర్నాక్‌లో చేసింది. ఇక ర‌వితేజ‌కు ధీటైన పోలీస్ క్యారెక్ట‌ర్‌కు ముందుగా జ‌గ‌ప‌తిబాబును అనుకున్నారు.

Watch Kick Full Movie Online in HD Quality | Download Now

ఆ త‌ర్వాత ఓ త‌మిళ మ్యాగ‌జైన్‌లో శ్యామ్ స్టిల్ చూసిన‌ సురేంద‌ర్‌రెడ్డి అత‌డికి స్టోరీ చెప్పి ఒప్పించారు. అలా కిక్ సినిమా తెర‌కెక్కింది. 2009 లో వ‌చ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే భారీ స్థాయిలో రిలీజ్ అయిన కిక్ తొలి ఆట నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఆ రోజుల్లోనే ఈ సినిమా రూ.22.75 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆ త‌ర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 2015లో కిక్ 2 వ‌చ్చినా ఆక‌ట్టుకోలేదు. ఇక ఎన్టీఆర్ కిక్ సినిమా చేసి ఉంటే క‌రెక్ట్‌ టైమ్‌లో మంచి హిట్ కొట్టి ఉండేవాడు.