పెళ్ళి పిటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్ .. ఏం షాక్ ఇచ్చిందిరా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిలైపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువైపోయింది . ఇప్పటికే బాలీవుడ్ – టాలీవుడ్ -కోలీవుడ్ స్టార్స్ గా చెప్పుకునే ప్రముఖ హీరోయిన్స్ అందరు పెళ్లిలు చేసుకుని లైఫ్ లో సెటిలైపోయారు . అంతేకాదు మరి కొంతమంది హీరోయిన్స్ పెళైన మూడు నెలలకే గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులకి డబల్ బూస్టప్ ఇస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది .

మనకు తెలిసిందే మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ .. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారింది . ఫస్ట్ హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకున్న శృతి .. ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . కాగా రీసెంట్ గానే తన 37వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న శృతిహాసన్..ప్రముఖ డూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో డేటింగ్ చేస్తుంది.

ఇప్పటికే ముగ్గురు బాయ్ ఫ్రెండ్లను మార్చిన రికార్డు అందుకున్న శృతిహాసన్ .. ఇతగాడితో కూడా బ్రేకప్ చెప్పేసింది అంటూ రీసెంట్గా వార్తలు వినిపించాయి. అయితే వాళ్లకి చెక్ పడుతూ దూరంగా ఉన్నంత మాత్రాన బ్రేకప్ చెప్పుకున్నట్లు కాదు ..అంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ శృతిహాసన్ వాళ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది . అయితే రీసెంట్గా ఇలాంటి ట్రోలింగ్ బాధలనుంది తప్పించుకోవడానికి శృతిహాసన్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట .

ఇప్పటికే 37 వయసు రావడంతో శృతిహాసన్ కి పెళ్లి చేయాలని కమల్ హాసన్ కూడా ఆలోచిస్తున్నాడట . ఇదే క్రమంలో శృతిహాసన్ నీ తన పెళ్లి గురించి ప్రస్తావించగా ఆమె కూడా పెళ్లికి రెడీ అంటూ.. కాకపోతే తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్ ను ఫినిష్ చేశాక పెళ్లి చేసుకుంటానంటూ తండ్రికి మాట ఇచ్చిందట . ఇదే కనుక నిజమైతే ఇయర్ ఎండింగ్ లో శృతిహాసన్ పెళ్లి చేసుకోబోతుంది . దీంతో ప్రజెంట్ శృతిహాసన్ పెళ్లి మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!