టాలీవుడ్ జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అనసూయ.. న్యూస్ రీడర్ గా తన కెరీర్ను ప్రారంభించింది . ఇక తర్వాత ఇండస్ట్రీలోకి రావాలన్న ఆశతో యాంకర్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసి .. ఆ తర్వాత వచ్చిన అవకాశాలలో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఈ క్రమంలోనే మంచి మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది .
మరీ ముఖ్యంగా అనసూయ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిలిం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా రాంచరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన రంగస్థలం అనే చెప్పాలి. కాగా పుష్ప పార్ట్ వన్ లో కూడా అనసూయ నటించి మంచి మార్కులు వేయించుకుంది. త్వరలోనే పుష్ప2 లో కూడా కనిపించనుంది . రీసెంట్గా రిలీజ్ అయిన మైకేల్ సినిమాలోని అనసూయ కనిపించి అలరించింది.
ఈ మధ్యకాలంలో అనసూయ వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ నే యాక్సెప్ట్ చేస్తుంది . దీంతోనే ఫ్యాన్స్ అనసూయను బ్యాడ్ గర్ల్ అంటూ ట్రోల్ చేశారు . ఈ క్రమంలోనే అనసూయ షారుక్ ఖాన్ మాట్లాడిన మాటలను పోస్ట్ చేస్తూ ..అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది . రీసెంట్గా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే . అంతకుముందు సినిమాలో నెగటివ్ రోల్స్ లో నటించిన .. పఠాన్ సినిమాతో మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.
ఈ క్రమంలోని షారుక్ మాట్లాడుతూ..” నెగటివ్ రోల్స్లో నటించిన కారణంగా మేము బ్యాడ్ బాయ్స్ అయిపోము.. మేము ఏం చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆ పాత్రలు పోషిస్తామంటూ షారుక్ ఘాటుగా స్పందించారు “. అవే కామెంట్స్ అనసూయ పోస్ట్ చేస్తూ ..”నేను మొదటి నుంచి ముత్తుకుంటుంది అదే ..ఇప్పటికైనా అర్థమైందా ..”అంటూ రాసుకొచ్చింది. . దీంతో అనసూయ తను చెప్పాలనుకున్న మాటలను క్లియర్గా చెప్పేసింది . ట్రోల్ చేసే వాళ్ళకి ఇచ్చి పడేసింది..!!