నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ అవుతుంది . కిర్రాక్ పార్టీ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన ..ఛలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోస్ కళ్ళల్లో పడింది . ఇక ఇదే క్రమంలో ఆమె అందానికి , నటనకు ఫిదా అయిన స్టార్ హీరోస్ బన్నీ – మహేష్ బాబు.. తమ తదుపరి సినిమాలో అవకాశమిచ్చి క్రేజీయస్ట్ హిట్లు ఇచ్చారు .
ఈ క్రమంలోనే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, బన్నీతో పుష్ప లాంటి సినిమాలను చేసింది . మరీ ముఖ్యంగా పుష్ప సినిమా చేసిన తర్వాత రష్మిక మందనకు ఏ రేంజ్ లో ఆఫర్స్ వరించాయో అందరికీ తెలిసిందే . ఏకంగా బాలీవుడ్లో ఏడు బడా సినిమాలకు సైన్ చేసింది . అంతెందుకు పుష్ప సినిమా తర్వాత ఇప్పటివరకు రష్మిక హిట్ కొట్టిందే లేదు ..అయినా ఆమె ఖాతాలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి అంటే .. పుష్ప ఇచ్చిన స్టార్డం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు .
కాగా రీసెంట్గా ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది రష్మిక మందన . అయితే ఈ సినిమా నుండి ఆమె ను తీసేసినట్లు సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . మిషన్ మజ్ను సినిమా రిజల్ట్ చూసిన తర్వాత కొరటాల శివ ఈ సినిమా నుండి రష్మికను డ్రాప్ చేయాలని భావిస్తున్నాడట. ఈ మధ్యకాలంలో వరుస వివాదాలు లో ఇరుక్కున్న రష్మిక ..ఎన్టీఆర్ థర్టీ సినిమాలో భాగమైతే.. సినిమాకి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నాయని..
ఈ క్రమంలోనే సినిమా నుండి ఆమెను తీసేసినట్లు ..సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో రష్మిక మందనకు కోలుకోలేని దెబ్బ పడినట్లు అయింది . ఇప్పటికే గుడ్ బాయ్ , మిషన్ మజ్ఞు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి . ఈ క్రమంలోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకోవడం ఆమెకు నిజంగానే బ్యాడ్ టైం నడుస్తుంది అంటున్నారు జనాలు . దీంతో కొందరు ఇక రష్మిక ముఖం ఎక్కడ పెట్టుకుంటుందో అంటూ కూడా కౌంటర్స్ వేస్తున్నారు..!!