ట్రైలర్: ఆసక్తికరంగా ఉన్న కళ్యాణ్ రామ్ ఆమిగోస్ ట్రైలర్..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా ఆషిక రంగనాథ్ నటిస్తున్నది. విభిన్నమైన యాక్షన్ త్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. కెరియర్ ప్రారంభం నుంచే ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు కళ్యాణ్ రామ్.

Amigos Release Date, Star Cast, Trailer, Plot, Makers & More - JanBharat  Times

గత ఏడాది బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రా ఈ ఏడాది కూడా అదే ఊపుతో అమిగోస్ సినిమాలో నటించారు ఇటీవలే విడుదలైన లిరికల్ వీడియోలు టీజర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరో వారం రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ని స్పీడ్ చేశారు చిత్ర బృందం. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్లు కూడా విడుదల చేయడం జరిగింది. దట్టమైన అడవిలో ఎన్ఐఏ బృందం భారీ కాన్వయంతో నూటరియస్ క్రిమినల్ ని షేర్ చేస్తూ ఉన్నట్లుగా ఈ ట్రైలర్లో చూపించడం జరిగింది.

ఇక మరొక హీరోయిన్ తో రొమాంటిక్ మూడ్ లో కళ్యాణ్ రామ్ ఎంట్రీ.. కళ్యాణ్ రామ్, బ్రహ్మజీ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తున్నాయి. ఇక కళ్యాణ్ రామ్ ఒక రాక్షసుడు తెచ్చి ఇంట్లో పెట్టావు కదరా అని అతని తండ్రి అనడంతో ఈ ట్రైలర్ మరింత ఆసక్తిని రేపించేలా కనిపిస్తోంది. ఈ చిత్రంతో కూడా ఈసారి కళ్యాణ్ రామ్ మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.