నిశ్చితార్థం అయిపోయింది అంటూ షాక్ ఇచ్చిన జబర్దస్త్ వర్ష..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించింది జబర్దస్త్ వర్ష. మొదట పలు సీరియల్స్ లో నటించిన పెద్దగా పాపులారిటీ కాలేదు. కానీ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మంచి పాపులారిటీ అందుకోవడంతోపాటు అభిమానులను కూడా సంపాదించింది. ముఖ్యంగా ఇమ్మానియేల్, వర్ష చేసేటువంటి కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వీరిద్దరి మధ్య చూపించే లవ్ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకుంటూ ఉంటాయి.

Jabardasth Varsha | Jabardasth Varsha - @varshajabardasthఎలాంటి విషయాలను అయినా సరే వర్ష ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా వర్ష తన ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ ఒక వీడియో చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకు నిజమైన ఎంగేజ్మెంట్ అయ్యిందా లేదా కావాలని వీడియో చేసిందా అనేది మాత్రం తెలియడం లేదు. బుల్లితెర పై తన గ్లామర్ తో యువతను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు తన అందచందాలతో మైమరిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షోల లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.పలు షోలకు గెస్టుగా కూడా పాల్గొని తన గ్లామర్ తో డాన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ఎన్నోసార్లు ఈమె పైన ట్రోలింగ్ జరగడం కూడా జరిగింది. ఇలాంటి ట్రోలింగ్ వల్ల ఎన్నో సార్లు వర్ష ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయని తెలియజేసింది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్స్ లో తన ఎంగేజ్మెంట్ అయ్యింది అంటూ ఒక వీడియోని షేర్ చేసింది. అయితే ఆ వీడియోలో పెళ్ళికొడుకు ఎవరు అనే విషయం తెలిపారు ఈ వీడియో చూస్తే తనకు నిజంగానే ఎంగేజ్మెంట్ అయినట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది.