ప‌వ‌న్ సినిమాలో అల్లు అర్హ‌.. క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క్యూటీ!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గార‌ల ప‌ట్టి అల్లు అర్హ త్వ‌ర‌లోనే వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `శాకుంత‌లం` సినిమాతో బాల‌న‌టిగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై తొలి అడుగు వేయ‌బోతున్న‌ది. గుణశేఖర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత‌, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ జంట‌గా న‌టించారు.

మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్హ క‌నిపించ‌బోతున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే ఈ సినిమా విడుద‌లకు ముందే అల్లు అర్హ మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ను కొట్టేసింది. ఈ క్యూటీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో అల‌రించ‌బోతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో `ఉస్తాద్ భగత్ సింగ్` అనే సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలో విజ‌య్ ద‌ళ‌ప‌తి, స‌మంత జంట‌గా న‌టించిన సూప‌ర్ హిట్ `తెరి`కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే తెరి సినిమాలో విజయ్ కి కూతురుగా మీనా కుమార్తె నటించింది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. విజయ్ సమంత కూతురుగా ఆమె కనిపిస్తుంది. అయితే రీమేక్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురుగా అల్లు అర్హ క‌నిపించ‌బోతుంద‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని టాక్ న‌డుస్తోంది.