పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న తారకరత్న.. అత‌డి లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్‌లా?

టీడీపీ యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో నడుస్తూ నంద‌మూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్ప‌ట‌ల్ లో చికిత్స అందుతోంది. తారకరత్న హెల్త్ కండీష‌న్ ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారు.

దాదాపు పది మంది వైద్యుల బృందం ఆయ‌న్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక‌పోతే తార‌కర‌త్నకు సంబంధించిన అనేక విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నారు. వాస్త‌వానికి తారకరత్న ఫ్యామిలీ గురించి ఎక్కువ మందికి తెలిసుండదు. అతని భార్య పేరు అలేఖ్య రెడ్డి. వీరిది ప్రేమ వివాహం. అయితే వీరి ల‌వ్ స్టోరీలో సినిమాకు ఏ మాత్రం తీసిపోని ట్విస్ట్ లు ఉన్నాయి.

హైదరాబాదులో ఒక కామ‌న్ ఫ్రెండ్ ద్వారా తారకరత్న, అలేఖ్య రెడ్డి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం స్పేహంగా మారి ప్రేమ‌కు దారి తీసింద‌ట‌. మొద‌ట తారకరత్న అలేఖ్య‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. అలేఖ్య‌కు కూడా ఇష్టం ఉండ‌టంతో వెంట‌నే ఒకే చెప్పింద‌ట‌. కానీ, వీరి పెళ్లిని ఇరు కుటుంబ‌స‌భ్యులు అంగీక‌రించ‌లేదు. సినిమా ఇండస్ట్రీ పై మంచి ఉద్ధేశం లేక‌పోవ‌డంతో అలేఖ్య ఇంట్లో పెళ్లికి నో చెప్పారు. మ‌రోవైపు తారకరత్న ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే అలేఖ్య‌కు అప్పటికే పెళ్లై విడాకులు అయ్యాయి. దాంతో పెద్ద‌ల‌ను ఎదురించి 2012 ఆగస్టు 2న హైదరాబాదులోని సంఘీ టెంపుల్లో తార‌క‌ర‌త్న‌, అలేఖ్య రెడ్డి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప జ‌న్మించిన త‌ర్వాత ఇరు కుటుంబాలు మ‌ళ్లీ తార‌క‌ర‌త్న‌, అలేఖ్య రెడ్డికి ద‌గ్గ‌ర‌య్యార‌ట‌.