బాలయ్య అభిమానులను హర్ట్ చేసిన అనిల్ రావిపూడి.. మరి ఇంత దారుణమా..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా తన 107వ సినిమా అయినా వీర సింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక సాంగ్ మినహా మిగిలిన సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ముందుకు రాబోతున్నాడు.

Anil Ravipudi and Nandamuri Balakrishna's NBK 108 first look is out

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 108వ సినిమాను వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు. ఇక ఈరోజు ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఇక ఈ సమయంలోనే బాలయ్య అభిమానులు అనిల్ రావుపూడి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య 108వ సినిమా నుండి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజు విడుదల చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం పూజా కార్యక్రమాలతో సరిపెట్టారు. ఇక బాలయ్య 108వ‌ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్న.. కానీ ఇప్పటివరకు షూటింగ్‌ను మొదలు పెట్టలేదు.

NBK 108: Anna Get Down! Gippadi Sandi Calculations Tucker.. Balakrishna  Never Before!

ఈరోజు నుంచి ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఇక రెగ్యులర్ షూటింగ్‌ను కూడా బ్రేక్ లేకుండా శరవేగంగా సినిమాను పూర్తి చేస్తామని దర్శకుడు అనిల్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే 108 వ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణను ఆయన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో కొత్తగా చూపించబోతున్నట్లు అనిల్ ఎంతో నమ్మకంగా చెప్పారు.ఈ సినిమాలో బాలయ్యకు జంటగా చాలా మంది హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. రీసెంట్‌గా ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ప్రియాంక జవాల్కర్ పేరు కూడా బయటకు వచ్చింది.

NBK 108: Balakrishna-Anil Ravipudi film launches with a pooja ceremony |  123telugu.com

ఇక ఆమె హీరోయిన్‌గా సెట్ అయి ఉంటే ఈరోజు ఈ సినిమా పూజ కార్యక్రమాలకు వచ్చి ఉండేది. కానీ ఆమె ఈ కార్యక్రమంలో ఎక్కడ కనబడలేదు. ఈ విధంగా ఈమె కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందన్న వార్తలపై అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ 55 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు కూతురుగా ఈ సినిమాలో పెళ్లి సందడి ఫ్రేమ్‌ శ్రీ లీల నటించబోతుంది. ఈ సినిమాతో బాలకృష్ణ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.