కళ్ళు జిగేల్‌మ‌నేలా బాల‌య్య ఆస్తులు… నంద‌మూరి ఫ్యామీలీలోనే టాప్..!

నందమూరి తారక రామారావు నట వారసుడుగా సినిమా పరిశ్రమంలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టడు బాలకృష్ణ. కెరియర్ మొదటిలో తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు. అంతే కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో తండ్రికి పోటీగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలోనే అగ్ర హీరోగా కొనసాగుతూ.. చిత్ర పరిశ్రమకు ఒక మూల స్తంభంగా ఉన్నాడు.

బాలకృష్ణ కేవలం హీరో గానే కాకుండా కొన్ని సినిమాలలో అతిథి పాత్రలో కూడా నటించాడు..బుల్లితెరపై కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఇప్పటి తరం హీరోలకు పోటీ ఇస్తున్నాడు. అంతే కాకుండా సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలకృష్ణ తన నటించే సినిమాలకు ఎంత మేర పారితోషకం తీసుకుంటున్నారు అంటే ఒకో సినిమాకు ఐదు కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల పారితోష‌కం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Balakrishna Nandamuri Luxury Life | Net Worth | Salary | Business |Cars |  House |Family |Biography - YouTube

ఈ విషయం ఎలా ఉంచితే బాలకృష్ణ కార్ల కలెక్షన్ విషయానికి వస్తే బెంట్లీ కారును ఇటీవల కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఆయన దగ్గర bmw లేటెస్ట్ కారుతో పాటు, ఆడి q5 కార్, టాటా సఫారీ, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు కూడా బాలకృష్ణ దగ్గర ఉన్నాయి. ఇక ఆయనకు హైదరాబాదులో జూబ్లీహిల్స్ లో 30 కోట్ల విలువ చేసే డూప్లెక్స్ బంగ్లా కూడా ఉంది.

హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని కోట్ల విలువ చేసే స్థలాలు కూడా ఉన్నాయి. ఆయన మొత్తం ఆస్తి విలువ చూస్తే 325.47 కోట్లు ఉంటున్నట్టు ఎలక్షన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. బంగారం, వెండి , ప్లాటినం వంటి విలువైన ఆభరణాలు కూడా వీరి దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే…. మొత్తంగా చూసుకుంటే సుమారుగా రూ.1000 కోట్ల వరకు ఆస్తి ఉంటుందని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి.