ప్ర‌తి సినిమా పాన్ ఇండియా అవ్వ‌దు.. ర‌వితేజ సెటైర్ ఎవ‌రికి..?

ఇటీవల కాలంలో సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం ట్రెండ్ అయిపోయింది. కంటెంట్ ఎలా ఉన్నా ప్రతి సినిమాను భారీ ఎత్తున వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాస్ మహారాజ్‌ రవితేజ పాన్ ఇండియా ట్రెండ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

`భారీ స్థాయిలో విడుదల చేసినంత మాత్రాన ప్రతి సినిమా పాన్ ఇండియా అయిపోదు. కథలో కంటెంట్ అందుకు తగ్గట్టు ఉండాలి. అప్పుడే అది పాన్ ఇండియా సినిమా` అవుతుంది అంటూ రవితేజ సెటైర్ పేల్చారు. ఈయ‌న సెటైర్ ఎవ‌రికి అన్నది తెలియదు కానీ.. తన సినిమాలో `టైగర్ నాగేశ్వరరావు` పాన్ ఇండియా సినిమా అవుతుంద‌ని రవితేజ పేర్కొన్నారు. దీంతో ఈయన కామెంట్స్‌ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా, రవితేజ నేడు `ధమాకా` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా న‌టించింది. త్రినాథ‌రావు న‌క్కిన‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ.. ధమాకా తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయం అని అంటున్నారు.