హిట్ కోసం బాలయ్య డేరింగ్ స్టెప్.. మూడోసారి కూడా సేమ్ టు సేమ్‌…!

నందమూరి బాలకృష్ణ మరియు మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి వచ్చే సంక్రాంతికి జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. గత సంవత్సరం బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో బాలకృష్ణ రెండో విభిన్నమైన పాత్రలలో కనిపించి ప్రేక్షకులకు ఢబుల్‌ ధమాకా అందించాడు.

Latest: NBK107 is officially titled Veera Simha Reddy | 123telugu.com

ఇప్పుడు సంక్రాంతికి రాబోయే వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్లను పెంచేశాడు దర్శకుడు గోపీచంద్. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎన్బీకే 108 సినిమాల్లో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తుంది.

NBK 108: 'ఎన్‌బీకే 108' అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నార‌ట‌!.. పండుగ అంటున్న  బాల‌కృష్ణ (Balakrishna) ఫ్యాన్స్

సాధారణంగా ఏ హీరో అయినా రెండు పాత్రలో నటించడం అంటే అంత మామూలు విషయం కాదు.. కానీ బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ డ్యూల్ రోల్ సినిమాలలో నటిస్తున్నాడంటే చాలా పెద్ద విషయమే.
అయితే బాలకృష్ణ మాత్రం తాను నటిస్తున్న వరుస సినిమాలలో అతి సునాయాసంగా డ్యూయల్ రోల్ లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Happy birthday Nandamuri Balakrishna: Twitter lights up as fans and celebs  celebrate actor's day | Regional-cinema News – India TV

ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తర్వాత చేయబోయే అనిల్ రావుపూడి సినిమా కూడా ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఆ సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు, ఆ సినిమా కూడా బాలయ్యకు మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇలా బాలకృష్ణ వరుసగా తాను నటించే మూడు సినిమాల్లో కూడా డ్యూయల్ రోల్‌లో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు.