అలనాటి సీనియర్ స్టార్ నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈ నటుడు తన ఇంట్లోను చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఈయన వయసు 88 సంవత్సరాలు. 770 సినిమాలకు పైగా నటించిన కైకాల సాధించిన కొన్ని రికార్డుల గురించి తెలుసుకుందాం.
హీరోగా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన కైకాల విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ,కమెడియన్ గా, తండ్రిగా, అన్నగా, సోదరుడిగా, తాతగా ఇలా ఎన్నో పాత్రలలో నటించారు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. చివరిగా 2019లో మహర్షి సినిమాలో నటించారు. అలా 60 సంవత్సరాల పాటు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు కైకాల. దాదాపుగా 28 పారాణిక చిత్రాలు 50కు పైగా జానపద చిత్రాలు పదికి పైగా చారిత్రాత్మక పాత్రాలలో నటించారు కైకాల. అందుకే ఈయనను నవరస నట బౌర్వసాముడు అనే బిరుదు కలదు.
తన కెరియర్ లో దాదాపుగా 200 మంది దర్శకులతో పనిచేశారు 50 కు పైగా హీరోలతో నటించారు. కానీ తన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎవరిని పరిచయం చేయలేకపోయారని కోరిక అలాగే మిగిలిపోయిందట. కైకాల నటించిన 230కు పైగా చిత్రాలు థియేటర్లో 100 రోజులు ఆడాయి. 60 సినిమాల వరకు 50 రోజులు ఆడి పలు రికార్డులను క్రియేట్ చేశాయి. పది సినిమాలు ఏడాది వరకు థియేటర్లలో సందడి చేసి రికార్డులను సృష్టించాయట. కైకాల నటనను గుర్తించిన వ్యక్తి డిఎల్ నారాయణ. కైకాల జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి మాత్రం నందమూరి తారక రామారావు గారే. రికార్డ్ స్థాయిలో ఎన్టీఆర్ తో 100 కు పైగా సినిమాలలో నటించారు కైకాల. ఎన్టీఆర్ గ్రూపుగా కూడా పలు చిత్రాలలో నటించారు. యముడుగా కూడా ఎక్కువసార్లు నటించిన ఘనత కైకాలదే. ఇక ఇలాంటి రికార్డులు మరే హీరో కూడా చేయలేరని చెప్పవచ్చు.