లాస్ట్ కి సమంత బ్రతుకు అదే..2025 లో ఛాప్టర్ క్లోజ్..వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈయన జ్యోతిష్యుడిగా సినిమా వాళ్లకు సంబంధించిన వారి జాతకాలను చెబుతూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారుతూ ఉంటారు. అయితే ఈయన చెప్పిన విధంగానేే కొందరి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో జరగడం వల్ల ఈయన ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు సెలబ్రిటీలకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

ఇప్పుడు తాజాగా ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మరోసారి స్టార్ హీరోయిన్ సమంత గురించి సంచలన కామెంట్లు చేశారు. అయితే ప్రస్తుతం సమంత మయోసైటిసిస్ అనే వ్యాధితో బాధపడుతూ విదేశాలలో చికిత్స తీసుకుంటుంది. ఈ వ్యాధి కారణంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటుంది. ఇప్పుడు వేణుస్వామి సమంత గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఇంటర్వ్యూలో వేణు స్వామి సమంత ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. 2025వ సంవత్సరం వరకు సమంతకి ఎలాంటి ఇబ్బందులు లేవని.. 2025వ సంవత్సరం తర్వాత ఆమె జాతకంలో ఏలినాటి శని ప్రవేశిస్తాడని.. అప్పటినుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు.

Venuswamy forecasts another Tollywood couple's divorce

ఆయన సమంత ఆరోగ్యం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుతూ.. ఆమె రాబోయే రోజుల్లో మరిన్ని ఆనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడంతో ఆమె అభిమానులు కాస్త ఆందోళన గురవుతున్నారు. వారిలో మరికొందరు మాత్రం ఆ వార్తలు కొట్టి పడేస్తూ.. సమంతకు ఏమీ కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ ఆమెకి ధైర్యం చెబుతున్నారు.