భారీ ధ‌ర ప‌లికిన విజ‌య్ ద‌ళ‌ప‌తి `వార‌సుడు` ఆడియో రైట్స్‌.. ఎంతంటే?

విజయ్ దళపతి.. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి సినిమాలు చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కునున్న `వారసుడు` సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో విజయ్ జంటగా కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, జయసుధ, శరత్ కుమార్, ప్రభు తదితరులు ప్రముఖ పాత్రలలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ తో విజయ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ ఫస్ట్ లుక్ చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవడం జరిగింది. కేవలం రెండు యాక్షన్ సీక్వెన్స్ లు అలాగే రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట.

అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగి ప్రేక్షకులను అలరించనున్నది. అయితే ఇప్పటికే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ దళపతి `వారసుడు` సినిమా ఆడియో రైట్స్ భారీ ధర పలికాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ సినిమా ఆడియో రైట్స్ దాదాపు 10 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. అయితే విజయ్ కెరియర్ లోనే ఇది అత్యంత బిగ్గెస్ట్ నెంబర్ అని అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.