బిగ్ షాక్: చిక్కుల్లో నాగార్జున..అక్కినేని ఇంటికి కోర్టు నోటీసులు..!?

నాగార్జున టైం అస్సలు బాగోలేదా.. అంటే అవునని అంటున్నారు జనాలు. ఓ పక్క కొడుకు జీవితం నాశనం అయిపోతుందనే బాధ్.. మరోపక్క సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతున్నాయనే టెన్షన్.. దీంతో మైండ్ రిలాక్స్ కోసం చేస్తున్న బిగ్బాస్ కూడా దారుణాతి దారుణంగా టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటూ పరమ చెత్త షోగా రికార్డ్ నెలకొల్పింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాల్టీ షో పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. కొందరు జనాలు నాగార్జున బూతులు తిడుతున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆ షో నుంచి తప్పుకోమని సలహా ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జునకు మరో బిగ్ షాక్ తగిలింది. బిగ్ బాస్ షో యువతను తప్పుదావ పట్టిస్తుందంటూ షోలో అసభ్యత ,అనైతికం ,హింసను ప్రోత్సహిస్తుంది అంటూ ఇప్పటికే చాలామంది కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ బిగ్ బాస్ ప్రసారాన్ని నిలిపివేయాలంటూ కొర్ట్ కు కూడా వెళ్లారు. అయితే రీసెంట్ గా దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ను మూడు ఎపిసోడ్లు చూస్తామని క్లారిటీ ఇచ్చింది.

Petition Filed For Recovery Of Amount Spent For Painting Government Buildings Of YSRCP Symbol In High Court!!! Deets Inside.... | Galli 2 Delhi Telugu News

అంతేకాదు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ , జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజు కూడిన ధర్మశాస్త్రం బిగ్ బాస్ షో విచారణపై కీలక నిర్ణయం తీసుకుంది .ఇందుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బిగ్ బాస్ షో నిర్వాహకులు హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు ధర్మశాస్త్రం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో మరోసారి బిగ్ బాస్ షో పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . కాగా ఈ పిటీషన్ పై విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది . దీంతో అక్కినేని నాగార్జున పరువు పోయినట్లుగా ఫీల్ అయిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఏది ఏమైనా అక్కినేని నాగార్జున ఇక బిగ్ బాస్ షో ని హోస్ట్ చేయకపోవడమే కరెక్ట్ అంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు.