పెళ్లికి సిద్ధమైన అల్లు అర్జున్-కాజల్.. వీరిని అడ్డుకున్నది ఎవరు?

కాజల్ అగర్వాల్.. `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తరువాత తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి స్టార్ డంను దక్కించుకుంది. కాజల్ దాదాపు 15 సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్గా వెలుగుతుంది. అయితే కాజల్ తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుని ఇటీవల కాలంలో ఒక బాబుకి జన్మనిచ్చింది.

 

ఇక అసలు విషయం ఏమిటంటే కాజల్ సినీ కెరీర్ లో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. అయితే గతంలో కాజల్ కి చాలామంది హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఎన్నో రూమర్స్ వచ్చాయి. కాజల్ ఆ పుకార్లను ఖండిస్తూ తాను ఎలాంటి ఎఫైర్స్ పెట్టుకోలేదని సంచలన ప్రకటన చేసిన కూడా ఆమెపై పుకార్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కాజల్ కెరియర్ లో అత్యంత ముఖ్యమైన కాంట్రవర్సీ ఏదంటే కాజల్, అల్లు అర్జున్ ప్రేమలో మునిగి తేలుతున్నారని.. పైగా హైదరాబాద్లోని సహజీవనం ఉంటున్నారని ఇలా ఒక్కటేమిటి వారిద్దరిపై చాలానే వార్తలు వచ్చాయి.

 

అయితే వీరిద్దరి ప్రేమకి అల్లు అరవింద్ ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లికి బ్రేక్ పడిందని పైగా అల్లు అరవింద్ సినిమాల్లో నటించే హీరోయిన్ తన ఇంటి కోడలిగా వద్దు అని కండిషన్ పెట్టడంతో పెళ్లికి సిద్ధమైన అల్లు అర్జున్ కాజల్ విడిపోవడం జరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తన స్నేహితురాలైన స్నేహారెడ్డి తో కొన్ని రోజులు ప్రేమలో ఉండి ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది.

 

 

అయితే అల్లు అర్జున్ పెళ్లి జరిగిన కొన్ని రోజులకు కాజల్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? వారిని పెళ్లి చేసుకుంటారా? అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా దానికి కాజల్ స్పందిస్తూ.. నేను సినిమాకి సంబంధించినంత‌వరకు ఎంతో ఎథికల్ గా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో నేను ఎవరితో దగ్గరగా కానీ క్లోజ్ గా గాని ఉండలేదు అని బ‌దులిచ్చింది. ఇక అప్పట్లో కాజల్ చేసిన కామెంట్స్ పెద్ద సంచలనమే సృష్టించాయి.