చిరు వర్సెస్ బాలయ్య.. సంక్రాంతి పోరు ఉందా? లేదా? తేల్చండి రా బాబు!

ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తరికెక్కుతున్న సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల అందరిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవల విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్.. ఈ సినిమాలో పక్క మాస్ రోల్ చేయబోతున్నారట. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ సినిమాలో చిరంజీవి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు మరోవైపు బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మాలినేని గోపీచంద్ దర్శకత్వం వహించగా హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవున్న అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే వీరిద్దరి సినిమాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తుండడంతో ఈ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమా కొన్నాళ్లపాటు వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది సంక్రాంతికి వస్తుందో? ఏది వాయిదా పడుతుందో? తెలియాలి అంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈనెల 21న బాలయ్య సినిమా టైటిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నట్టు.. దీపావళి రోజున మెగాస్టార్ సినిమా రిలీజ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై చిరు వర్సెస్ బాలయ్యా.. సంక్రాంతి పోరు ఉందా? లేదా? తేల్చండ్రా బాబు.. అన్న‌ట్టూ ఇటు నందమూరి అభిమానులు అటు మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.