విజయ్ న్యూడ్ పోస్టర్ పై స్టార్ హీరోయిన్స్ హాట్ కామెంట్స్.. ఇదేం క్రేజ్ రా బాబోయ్..!!

విజయ్ దేవరకొండ..ఈ రౌడీ హీరో కి ఏ రకమైన క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడే ఈ హీరో అంటే జనాలకు అదో రకమైన ఇది. ఈయన పొగిడే వాళ్లు ఎంత మంది ఉన్నారో తిట్టే వాళ్లు ఆ సంఖ్యలోనే ఉన్నారు. వ్యక్తిగతంగా విజయ్ ఎలాంటి కాంట్రవర్షీయల్ జోలికి వెళ్ళడు.

ఇప్పటి వరకు విజయ్ చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఫ్లాప్ లు , హిట్లు సమానంగా ఉన్నాయి. ఫ్లాప్ వల్ల నెగిటివ్ టాక్ వచ్చినా జనాలు ఆయన హిట్ సినిమాల టాక్ నే పరిగణలోకి తీసుకుంటారు. అంతటి పిచ్చి ఫాలోయింగ్ ఉంది విజయ్ కి. అసలే విజయ్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దీనికి తోడు విజయ్ న్యూడ్ కనిపిస్తే..వామ్మో ఆ క్రేజ్ తట్టుకోలేం రా సామీ అనాల్సిందే.

రీసెంట్ గా విజయ్ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో రాబోతున్న లైగర్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఓ న్యూడ్ పోస్టర్ ని వదిలారు. నిజానికి విజయ్ లాంటి స్టార్ హీరో ఇలా బంటి మీద బట్టలు లేకుండా న్యూడ్ గా ఫోటోకి స్టిల్ ఇవ్వడం కష్టం. కానీ దాని చేసి చూపించాడు ఈ రౌడీ హీరో. ఆయితే, ఈ న్యూడ్ పోస్టర్ పై నెట్టింట రకరకాల ట్రోల్స్ నడుస్తున్నాయి.

కానీ, మన హాట్ హీరోయిన్స్ ఇలాంటివి ఏం పట్టించుకోకుండా..విజయ్ న్యూడ్ పోస్టర్ పై స్టన్నింగ్ కామెంట్స్ చేస్తూ పోస్టర్ పై మరింత హీట్ పెంచారు. విజయ న్యూడ్ ఫోటో పై స్టార్ హీరోయిన్స్ సమంత, పూజా హెగ్డే, రష్మిక,తమన్నా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్..ఇలా వరుసగా అందాల ముద్దుగుమ్మలు అందరు విజయ్ ని ఓ రేంజ్ లో పోగిడేశారు. ఇది ఒకరంగా సినిమాకి భారీ హైప్ ని ఇచ్చిందనే చెప్పాలి.

Share post:

Latest