కేవలం దానికేనా.. ఇంకా వేరేది లేదా అంటోన్న బాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోవాలని చూసిన చాలా మంది, ఆ తరువాత కాలంలో కనుమరుగయ్యారు. అయితే కొందరు మాత్రం తమలో సినిమా పట్ల ఆశ అలాగే ఉండటంతో ఇండస్ట్రీలో ఏదో ఒక పాత్ర చేస్తూ కాలం నెట్టుకొస్తుంటారు. ఇలాంటి వారిలో ఎక్కువగా ఐటెం సాంగ్స్, వ్యాంప్ తరహా పాత్రలు చేసినా వారి సంఖ్యే ఎక్కువ. అయితే బాలీవుడ్‌లో ఐటెం బాంబ్‌గా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్ గురించి ప్రత్యేకించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు.

ఈ బ్యూటీ వెండితెరపై అందాల ఆరబోత చేసిందంటే కుర్రకారును ఆపడం ఎవరి తరం కాదు. ఈమె కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో ఓ ప్రత్యేక పాత్ర ఉండాల్సిందే అని కోరుకునే వారు. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు ఈ బ్యూటీని పట్టించుకునే వారే లేరు. రాఖీ సావంత్ కంటే కూడా ఎక్కువ అందాల ఆరబోతలు ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ చేస్తుండటంతో ప్రత్యేకంగా ఇలాంటి వారి కోసం సినిమాల్లో ఎలాంటి పాత్రలు, సాంగ్స్ పెట్టడం లేదు. దీంతో తమలాంటి వారికి తీవ్ర నష్టం జరుగుతుందని రాఖీ అంటోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాఖీ, తనను కేవలం సెక్స్ ఇమేజ్ ఉన్న పాత్రలు, ఐటెం సాంగ్స్‌కే ఇండస్ట్రీలో వాడుకున్నారని.. తనలోని నటిని ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదని ఆమె వాపోయింది. అయితే తనకు ఒకవిధంగా తాను చేసిన పాత్రలే పేరు తెచ్చాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటికీ తనను బాలీవుడ్ ప్రేక్షకులు గుర్తుకుపెట్టుకున్నారంటే అది కేవలం తన డ్రెస్సింగ్, అందాల ఆరబోతే కారణమని గర్వంగా చెబుతోంది ఈ బ్యూటీ. మరి నిజంగానే రాఖీ సావంత్‌ను సెక్స్ అప్పీల్ కోసం కాకుండా యాక్టింగ్ కోసం వాడుకునే డైరెక్టర్ ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అనేది బాలీవుడ్ డైరెక్టర్స్ తేల్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఏదేమైనా రాఖీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం బీటౌన్‌లో వైరల్‌గా మారాయి.