ఆ హీరో పేరును జపం చేస్తోన్న సామ్.. ఏమిటమ్మా ఇది?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో తాజాగా సమంత గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక కరణ్ జోహర్ సమంతను పలు పర్సనల్ విషయాలను గురించి ప్రశ్నలు అడగ్గా, అందులో తన మాజీ భర్త నాగచైతన్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. అయితే సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, సమంత తన మాజీ భర్త కంటే కూడా ఇతర హీరోల పేర్లనే ఎక్కువగా ఈ షోలో వాడటం మనం చూశాం. ముఖ్యంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరును సమంత పదేపదే తెరపైకి తీసుకొచ్చింది. హీరో అంటే విజయ్ దేవరకొండలా ఉండాలని.. సెల్ఫ్ మేడ్ హీరో అంటే విజయ్ అని.. ఇలా పులుమార్లు అతడి నామజపం చేస్తూ కనిపించింది. అయితే ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమా చేస్తున్న కారణంగా అతడి గురించి ఎక్కువగా మాట్లాడి ఉండొచ్చని కొందరు అంటుంటే.. ఇతర హీరోలతో కూడా అమ్మడు సినిమాలు చేసిందిగా.. మరి వారి పేర్లను ఎందుకు వాడటం లేదని మరికొందరు అంటున్నారు.

ఏదేమైనా సామ్ ఈ టాక్ షోలో చేసిన కామెంట్స్ అటు ప్రొఫెషనల్‌గానూ, పర్సనల్‌గానూ ఆమెను హైలైట్ చేస్తూ వస్తున్నాయి. సోషల్ మీడియాలో సమంత నిన్నటి నుండి ట్రెండింగ్‌లో ఉండటమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. మరి నిజంగానే కేవలం ట్రెండింగ్ కోసం ఆమె విజయ్ దేవరకొండ పేరును వాడిందా.. లేక వేరే మత్లబు ఏదైనా ఉందా అని ఆమె యాంటీ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మరి ఈ విషయంపై సమంత ఇంకా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.