ఆసుపత్రిలో యంగ్ హీరో.. ఏమయ్యిందో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. క్యారెక్టర్ పాత్రల నుండి హీరో స్థాయికి ఎదిగిన శ్రీవిష్ణు, ఒక సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుందనే భావన చాలా మంది ఆడియెన్స్ లో ఉంటుంది. ఇక అలాంటి ఈ హీరో, ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్నా, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. అయితే ఈ హీరో తాజాగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడనే వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇంతకీ శ్రీవిష్ణుకి ఏమైంది..? ఆయన్ను ఆసుపత్రిలో ఎందుకు జాయిన్ చేశారు? అనే విషయాలు తెలుసుకుందామా.

శ్రీవిష్ణు ప్రస్తుతం అల్లూరి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థమువతోంది. అయితే శ్రీవిష్ణు తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ హీరోకు డెంగ్యూ జ్వరం రావడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారట కుటుంబ సభ్యులు. డెంగ్యూ బారిన పడ్డ శ్రీవిష్ణు ప్రస్తుతం ప్లేట్ లెట్స్ పడిపోవడంతో తీవ్ర అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది.

ఇంతలా అనారోగ్యం బారిన పడ్డ శ్రీవిష్ణు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ హీరోకు ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుందని, అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక ఇండస్ట్రీలో చాలా మందితో మంచి రిలేషన్ ఉన్న శ్రీవిష్ణు ఆరోగ్యం గురించి తెలుసుకుని, పలువురు స్టార్స్ ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారట. మరి ఈ హీరో ఎప్పుడు కోలుకుంటాడో, ఎప్పుడు తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటాడో అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.