అల్లు అర్జున్‌కి నందమూరి అభిమానుల సపోర్ట్ .. కారణం..?

గత కొన్ని రోజుల నుంచి అటు అల్లు అర్జున్ అభిమానులకు ఇటు మెగా అభిమానులకు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ట్విట్టర్లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు మొన్న విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా అల్లు అర్జున్ ని తప్పించి రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్, చిరంజీవి , నాగబాబు ఫోటోలతో కూడిన భారీ ప్లకార్డు ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే పెద్ద ఎత్తున మెగా అభిమానులకు అల్లు అర్జున్ మింగుడు పడడం లేదని తెలుస్తోంది.

కానీ తాజాగా అల్లు అర్జున్ ఒక్కడే మిగిలిపోయాడని వారి అభిమానులు బాధ పడుతున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు వారికి అండగా నిలిచారు. ఇకపోతే ఉన్నట్లుండి అల్లు అర్జున్ కి నందమూరి అభిమానులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. నిజానికి అల్లు అర్జున్ సొంత టాలెంట్ తో స్టార్‌డం సంపాదించుకున్న ఏకైక హీరో అని చెప్పవచ్చు.

చిరంజీవి మాత్రం తన సొంత టాలెంట్ తో పైకి వచ్చినప్పటికీ అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య.. అలాగే అల్లు అరవింద్ సహాయంతోనే చిరంజీవి మెగాస్టార్ గా మారాడు అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ విషయం చాలామందికి మింగుడు కూడా పడటం లేదు. అయితే అల్లు అర్జున్ కి కూడా ఇదే ఆలోచన ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన సొంత ప్రతిభతో ఇండస్ట్రీలో తమ పేరుకు బ్రాండ్ ని సృష్టించుకున్నాడు.

ఇక అంతే కాదు మెగా ఫ్యామిలీ నీడ లో నడవడానికి కూడా అల్లు అర్జున్ ఇష్టం చూపడం లేదు. మొన్నా మధ్య పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని ఒక మీటింగ్లో అడగగా అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని చెప్పడంతో ఇక ఆ రోజు నుంచి అల్లు అర్జున్ అంటే మెగా అభిమానులకు పడడం లేదు. ఇక అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ లో ఒకటిగా ఉన్నంతవరకు చరణ్ నటన ను ఎవరు మెచ్చుకున్న దాఖలాలు లేవు. కానీ రంగస్థలం, ధ్రువ వంటి సినిమాలతో తన నటనను చూపించడంతో ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ నటన చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇక ఇదిలా ఉండగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సినిమా విడుదల కాకపోయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగాడు అల్లు అర్జున్. ఇక నందమూరి అభిమానులు విషయానికి వస్తే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా అద్భుతంగా ఉందని ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అల్లు ఫ్యామిలీ ఏర్పాటుచేసిన ఆహా అన్ స్టాపబుల్ షోకి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించి మంచి విజయాన్ని అందించారు. ఇక అల్లు అర్జున్ – ఎన్టీఆర్ బావా అని పిలుచుకుంటారు . ఇక అలా వీరిద్దరి మధ్య సన్నిహితం ఏర్పడడం వల్లే ఇప్పుడు ఒంటరివాడు అయిన అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ అభిమానులు సపోర్ట్ ఇవ్వడం గమనార్హం.

Share post:

Popular