ఫ్యాన్స్ దెబ్బ‌కు స్టేజ్‌పైనే ఏడ్చేసిన సాయి ప‌ల్ల‌వి..వీడియో వైర‌ల్‌!

December 19, 2021 at 11:34 am

ఫిదా సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పట్టిన అందాల భామ సాయి ప‌ల్ల‌వి.. అతి త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్న సాయి ప‌ల్ల‌వి.. ప్ర‌స్తుతం `శ్యామ్ సింగరాయ్‌`లో న‌టించింది.

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వితో పాటుగా కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా హీరోయిన్లుగా న‌టించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే ప్రచార కార్య‌క్ర‌మాల‌ను జోరుగా నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్‌.. నిన్న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఫ్యాన్స్ దెబ్బ‌కు స్టేజ్‌పైనే సాయి ప‌ల్ల‌వి ఏడ్చేసింది. సాయిపల్లవి మాట్లాడేందుకు స్టేజ్ మీదకు రాగానే ఈలలు, గోలలతో ప్రీ రిలీజ్ ప్రాంగణం హోరెత్తిపోయింది.

ఏదేమైనా ఒక హీరోయిన్ పేరు వినగానే ఫ్యాన్స్ అంతలా అరవడం చాలా అరుదు. అందుకే ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేక‌పోయిన సాయి పల్లవి కంట నీరు పెట్టుకుంటూనే త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఫ్యాన్స్ దెబ్బ‌కు స్టేజ్‌పైనే ఏడ్చేసిన సాయి ప‌ల్ల‌వి..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts