ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ నిన్న తెలుగుతో పాట తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాసల్లో అట్టహాసంగా విడుదలైంది.
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాక్ ఎలా ఉనప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ రూ. 38.49కోట్ల షేర్ కలెక్ట్ చేసిన బన్నీ.. రెండో రోజు రూ. 20.41 కోట్ల షేర్ వసూల్ చేసి తగ్గేదే లే అన్న రీతిలో దూసుకుపోయాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప సెకండ్ డే కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి..
నైజాం- 7.4 కోట్లు
సీడెడ్- 2.02 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.25కోట్లు
తూర్పు గోదావరి- 76 లక్షలు
పశ్చిమ గోదావరి- 52 లక్షలు
గుంటూరు- 55 లక్షలు
కృష్ణ- 77 లక్షలు
నెల్లూరు- 43 లక్షలు
——————————————————————-
ఏపీ-తెలంగాణ మొత్తం= 13.70 కోట్లు(20.5కోట్లు- గ్రాస్)
——————————————————————-
కర్ణాటక- 4.9 కోట్లు
తమిళనాడు- 3.05 కోట్లు
కేరళ- 1.55 కోట్లు
హిందీ-3.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.4 కోట్లు
ఓవర్సీస్ – 6.05 కోట్లు
వరల్డ్ వైడ్‌గా పుష్ప టూ డేస్ కలెక్షన్- 58.90 కోట్లు (94కోట్లు- గ్రాస్)
ఇక పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.144.90 కోట్లు ప్రీ బెజినెస్ చేయగా.. బ్రేక్ ఈవెన్ అవ్వాలం రూ.146 కోట్లను రాబట్టాలి. ఈ లెక్కన పుష్ప రాజ్ ఇంకా రూ. 87.10 కోట్లు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంది.