పుష్ప దిగినా త‌గ్గ‌ని `అఖండ` జోరు.. 17వ రోజూ హౌస్ ఫుల్సే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ క్రియేష‌న్స్ బ్యాప‌ర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

విడుద‌లైన రోజు నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద భారీ కలెక్షన్లను కొల్ల‌గొట్టి లాభాల బాట ప‌ట్టిన అఖండ‌.. ఇప్ప‌టికీ దూసుకుపోతోంది. మ‌రోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తొలి పాన్ ఇండియా చిత్రం విడుద‌లైన పుష్ప జోరు త‌గ్గ‌డం లేదు. విడుద‌లై 17 రోజులు గ‌డుస్తున్నా.. ప‌లు చోట్ల హౌస్ ఫుల్ బోర్డులే ద‌ర్శ‌నం ఇచ్చాయి.

అంతేకాదు, 16వ రోజు 29 ల‌క్ష‌ల షేర్ వ‌సూల్ చేసిన అఖండ.. 17వ రోజు ఏకంగా రు. 46 ల‌క్ష‌ల షేర్‌ను రాబ‌ట్టి ఓరా అనిపించింది. దీంతో బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని అఖండ నిరూపించిన‌ట్టైంది. మరి ఈ మూవీ 17 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి..

అఖండ 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్:

నైజాం- 18.58 కోట్లు
సీడెడ్- 14.19 కోట్లు
ఉత్తరాంధ్ర- 5.78 కోట్లు
ఈస్ట్- 3.89 కోట్లు
వెస్ట్- 3.24 కోట్లు
గుంటూరు- 4.48కోట్లు
కృష్ణా- 3.29 కోట్లు
నెల్లూరు- 2.45కోట్లు
————————————————————————-
ఏపీ-తెలంగాణ టోటల్- 56.00 కోట్ల షేర్(91.80 కోట్లు- గ్రాస్‌)
————————————————————————–

క‌ర్నాట‌క + రెస్టాఫ్ ఇండియా – 4.66 కోట్లు
ఓవ‌ర్సీస్ – 5.28 కోట్లు
————————————————————————-
టోట‌ల్ వ‌రల్డ్ వైడ్ షేర్ = 65.94 కోట్లు(114.15 కోట్లు-గ్రాస్‌)
————————————————————————