సీనియర్ స్టార్ హీరో, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం తనయుడు నాగ చైతన్యతో కలిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. అలాగే జాతిరత్నాలు సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హైదరాబాది పిల్ల ఫరియా అబ్దుల్లా బంగార్రాజు చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా `వాసి వాడి తస్సదియ్య..` అంటూ సాగే ఆ ఐటెం సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్‌లో అక్కినేని హీరోలైన నాగ్, చైతులతో ఫరియా డ్యాన్స్ అదరగొట్టేసింది. `నువ్వు పెళ్లి చేసుకొని వెళ్లిపోతే బంగార్రాజు.. మాకు ఇంకెవడు కొనిపెడతడు కోక బ్లౌజు.. నువ్వు శ్రీ రాముడివి అయిపోతే బంగార్రాజు.. మాకు ఎవరు తీరుస్తారు ముద్దు మోజు` అంటూ సాగే ఈ సాంగ్ లిరిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.
అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ సాంగ్‌లో నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా..చైతు మాత్రం మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఫరియా మాత్రం ఆటంబాంబ్‌లా మెరిసిపోతోంది. మొత్తానికి అదిరిపోయిన ఈ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.