కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత, యాంకర్ మంచు లక్ష్మికి యాక్సిడెంట్ అయింది. చేతులతో పాటు కాళ్లకు కూడా రక్తం కారుతున్న ఫొటోలను ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వీటిని చూసిన ఆమె ఫ్యాన్స్ తెగ ఖంగారు పడిపోయారు. అసలేం జరిగిందంటూ ఆమె పోస్ట్ కింద వరసగా మెసేజ్‌లు పెట్టారు.
దాంతో స్పందించిన మంచు లక్ష్మి.. తనకు జరిగింది రియల్ యాక్సిడెంట్ కాదు. రీల్ యాక్సిడెంట్. సినిమా షూటింగ్‌లో భాగంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చింది. అంతే కాదు, తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు సంతోషం వ్యక్తం చేసింది. ఇక అప్పుడు కంగారు పడ్డవారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అయితే నెటిజన్లు మాత్రం మంచు లక్ష్మి చేసిన పనికి ఆమెపై మండిపుడుతున్నారు. జనాల్ని పిచ్చోళ్లని చేసిందని, ఇలాంటి విషయాల్లో తమాషాలు అవసరమా అని రకరకాల కామెంట్స్ చేస్తూ మంచు లక్ష్మిపై ఫైర్ అవుతున్నారు. దాంతో మరో సారి ఆమె వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, మంచు లక్ష్మి ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి `మాన్‌స్టర్` అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పాత్ర కోసం ఆమె చాలానే కష్టపడ్డారు. కలరిపట్టు విద్యను కూడా నేర్చుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫొటోలనే తాజాగా మంచు లక్ష్మి పోస్ట్ చేసి.. నెటిజన్ల చేత ట్రోలింగ్‌కు గురవుతోంది.